SRHకి దొరికిన ఆణిముత్యం ఇషాన్ మలింగ.. 4 ఓవర్లలో 1/29, ఇది కదా ఆరెంజ్ ఆర్మీ కోరుకునేది!

Wait 5 sec.

పేరు చెబితే ముందుగా గుర్తొచ్చేది అరివీర భయంకర బ్యాటర్లు. ఓపెనర్లే హిట్టర్లుగా ఉన్న ఈ టీమ్‌ ఎప్పడెప్పుడు 300 కొడుతుందా అని ఐపీఎలే ఎదురుచూస్తోంది. కానీ.. ఆ జట్టుకు ఉన్న పెద్ద మైనస్ బౌలర్లే. ఎంత భారీ స్కోర్ అయినా ఛేజ్ చేయగల బ్యాటర్లు ఉన్నా.. టార్గెట్‌ను డిఫెండ్ చేయగల బౌలర్లు మాత్రం లేరు. కానీ.. ఒకే ఒక్కడు మాత్రం తన స్పెల్‌తో ప్రతి మ్యాచ్‌లోనూ ఆకట్టుకుంటున్నాడు.. అతనే !ఇషాన్ మలింగ జట్టుకు దొరికిన ఓ పెద్ద ఆణిముత్యం అని చెప్పొచ్చు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బౌలర్లు కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌తో సహా అందరూ మినిమం పదికి తగ్గకుండా పరుగులు ఇస్తే.. ఒక్క ఇషాన్ మలింగ మాత్రమే చాలా కంట్రోల్‌గా బౌలింగ్ చేశాడు. టాక్టిక్ బౌలింగ్‌తో డేంజరస్ సూర్యకుమార్ యాదవ్‌ని పెవిలియన్‌కు కూడా పంపాడు. వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇషాన్ మలింగ నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 29 పరుగులే ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఏకంగా 243 పరుగులు చేస్తే.. ఇషాన్ మలింగ ఇచ్చింది మాత్రం 29 పరుగులే. ఇషాన్ మలింగ కూడా భారీగా పరుగులు సమర్పించుకుని ఉండుంటే ముంబై ఇండియన్స్ ఈజీగా 270 పరుగులు నమోదు చేసేది. ఈ సీజన్‌లో ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలోనూ ఇషాన్ మలింగ బౌలింగ్ చేశాడు. తొమ్మిది మ్యాచ్‌లలో కలిపి 15 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు అందరికంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా ఇషాన్ కిషన్ నిలిచాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 2, లక్నోపై 1, రాజస్థాన్‌పై 2, సీఎస్కేపై 3, ఢిల్లీపై 4, రాజస్థాన్‌పై 2, ముంబై‌పై ఒక్క వికెట్ పడగొట్టాడు. ఈ సీజన్‌లో ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్‌పై మాత్రం ఇషాన్ మలింగ్ వికెట్ పడగొట్టలేదు.. ఇక మిగతా అన్ని మ్యాచ్‌లలోనూ వికెట్లు తీసుకున్నాడు. ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచ్‌లు ఆడింది. అందులో కేవలం మూడు మ్యాచ్‌లే ఓడిపోగా.. ఆరు మ్యాచ్‌లలో విజయం సాధించింది. మొత్తం 12 పాయింట్లు, +0.832 నెట్ రన్‌రేట్‌తో మూడో స్థానంలో కొనసాగుతోంది. ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టాలంటే సన్‌రైజర్స్ జట్టు మిగతా ఆరు మ్యాచ్‌లలో కచ్చితంగా రెండు గెలిచి తీరాల్సిందే.