ఇరాన్‌ను కోలుకోలేని దెబ్బకొడుతున్న ట్రంప్.. నాలుగేళ్ల గరిష్ఠానికి క్రూడాయిల్ ధరలు.. భారత్‌కు కష్టమే!

Wait 5 sec.

: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. యుద్ధం ముగింపుపై స్పష్టత లేని కారణంగా.. అంతర్జాతీయ మార్కెట్‌లో మరోసారి భగ్గుమన్నాయి. ఏప్రిల్ 29-30 తేదీల్లో దాదాపు 8 శాతానికిపైగా పెరిగి ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 122 డాలర్లు దాటింది. ఫిబ్రవరి నెల చివర్లో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇదే అత్యధికం కావడం గమనార్హం. అప్పటినుంచే కాదు.. నాలుగేళ్ల గరిష్ఠాల్ని కూడా తాకాయి. అప్పట్లో రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో 2022 మధ్యలో ముడి చమురు ధరలు ఈ స్థాయిలో ఉండేవి. అక్కడి నుంచి వరుసగా తగ్గుతూ రాగా.. పశ్చిమాసియాలో ఇరాన్- అమెరికా- ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి పెరిగాయి. తీవ్ర హెచ్చుతగ్గులకు లోనై ఇప్పుడు గరిష్ఠ స్థాయిలకు చేరాయి. >> .. దీనిని దీర్ఘకాలిం కొనసాగించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీని కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇప్పటికే తమ అధికారుల బృందానికి ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ వీలైనంత ఎక్కువ కాలం దిగ్బంధనం ద్వారా.. ఇరాన్ ఎగుమతుల్ని అడ్డుకునేలా చేయడంతో.. ఆర్థికంగా ఆ దేశాన్ని ఉక్కిరిబిక్కిరయ్యేలా చేయాలని చూస్తున్నారు. అప్పుడు అణ్వస్త్ర ప్రణాళికను పక్కనబెడుతుందని భావిస్తున్నారు ట్రంప్. ఇదే సమయంలో ఇరాన్ కూడా ఘాటు హెచ్చరికలు చేసింది. దిగ్బంధనాన్ని పొడిగిస్తే.. మునుపెన్నడూ లేని విధంగా తీవ్ర స్థాయిలో సైనిక దాడులకు దిగుతామని వార్నింగ్ ఇచ్చింది. దీనిపై ట్రంప్ మరోసారి స్పందించారు. చర్చల విషయంలో ఇరాన్ సరిగ్గా వ్యవహరించలేకపోతోందంటూ.. అణు కార్యక్రమానికి త్వరలో దౌత్యపర పరిష్కారం రాకుంటే.. అమెరికా కఠిన వైఖరి అవలంబిస్తుందని చెబుతూ.. రైఫిల్ పట్టుకున్న ఫొటోను ట్రంప్ 'ట్రూత్ సోషల్‌'లో పోస్ట్ చేశారు. దీంతో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రమవుతాయన్న ఆందోళనల నేపథ్యంలో.. క్రూడాయిల్ ధరలు భారీ స్థాయిలో ఎగబాకాయి. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడం.. ఇరాన్ నౌకలపై అమెరికా దిగ్బంధనం నేపథ్యంలో.. చమురు రవాణాకు అంతరాయం నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నాయి. యుద్ధం ప్రారంభానికి ముందు ముడి చమురు ధరలు 70 డాలర్ల దిగువన ఉండేవి. ఇక యుద్ధం మొదలైన కొన్ని రోజుల్లోనే ఇది 100 డాలర్లపైకి చేరి.. హెచ్చుతగ్గులకు లోనవుతూ వస్తోంది. ఒపెక్ నుంచి యూఏఈ నిష్క్రమణ..ఇదే సమయంలో కూడా అనిశ్చితికి కారణమవుతోంది. మరోవైపు యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కూడా కీలక వడ్డీ రేట్లను మార్చలేదు. ముడి చమురు ధరలు పెరగడం వల్ల భారత్‌పై పెద్ద దెబ్బే పడనుంది. చమురు దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ ముందు వరుసలో ఉండగా.. ఇక్కడ దిగుమతులు లేక నిల్వలు నిండుకుంటున్నాయి. దీంతో ఇంధన ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పలు పెట్రోల్ బంకులు.. దేశంలో స్టాక్ లేక ఖాళీగా దర్శనమిస్తుండగా.. మిగతా వాటిల్లో జనం రద్దీ ఎక్కువగా ఉంది. ఇక.. ఇప్పటికే వంట గ్యాస్ ధరలు పెరగ్గా.. త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ద్రవ్యోల్బణానికి దారితీసి.. ఇతర నిత్యావసర ధరలు కూడా పెరిగే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.