టూరిస్ట్ వీసాపై వచ్చి మతబోధనలు.. అమెరికన్లకు షాకిచ్చిన భారత్.. దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు..!

Wait 5 sec.

: టూరిస్ట్ వీసాపై భారత్‌కు వచ్చి.. నిబంధనలకు విరుద్ధంగా మతబోధనలు చేస్తున్న ముగ్గురు అమెరికా పౌరులపై పుణె పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. వీసా నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను వారిని తక్షణమే దేశం విడిచి వెళ్లాలని ఆదేశిస్తూ "లీవ్ ఇండియా" నోటీసులు జారీ చేశారు. ఈ ముగ్గురు విదేశీయులు మే 10వ తేదీలోగా భారతదేశాన్ని వీడాలని పోలీసులు గడువు విధించారు.అసలేం జరిగిందంటే..?అమెరికాకు చెందిన 53, 65, 66 ఏళ్ల వయసున్న ముగ్గురు వ్యక్తులు ఏప్రిల్ నెల ఆరంభంలో టూరిస్ట్ వీసాపై భారత్‌కు వచ్చారు. పుణెలో పర్యటిస్తున్న సమయంలో వీరు పర్యాటకులుగా కాకుండా.. మత ప్రచారకులుగా వ్యవహరిస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. పుణెలో ప్రయాణిస్తున్న సమయంలో ఒక టాక్సీ డ్రైవర్‌కు వీరు బైబిల్‌, క్రైస్తవ మతానికి సంబంధించిన కరపత్రాలను అందజేశారు. ఇంగ్లీష్, హిందీ, మరాఠీ భాషల్లో ఉన్న ఈ పత్రాలను ఇచ్చి.. తనను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారని సదరు డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.రంగంలోకి దిగిన పోలీసులు ఆ ముగ్గురు అమెరికన్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద సోదాలు చేయగా.. వివిధ భాషల్లో, భారీ సంఖ్యలో ఉన్న మతపరమైన కరపత్రాలు లభ్యం అయ్యాయి. దీంతో వీరిని తదుపరి విచారణ నిమిత్తం ఫారినర్స్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (FRO)కు తరలించారు.వీసా నిబంధనల ఉల్లంఘన..విచారణ అనంతరం పుణె డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సందీప్ భాజీభాకరే మాట్లాడుతూ.. నిందితులు పర్యాటక వీసా నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించినట్లు నిర్ధారణ అయిందని తెలిపారు. "భారత చట్టాల ప్రకారం.. టూరిస్ట్ వీసాపై వచ్చే విదేశీయులు ఎలాంటి మతపరమైన బోధనలు, ప్రచారాలు లేదా మత మార్పిడి కార్యక్రమాల్లో పాల్గొనకూడదు. పర్యాటక వీసా కేవలం విహార యాత్రలకు మాత్రమే పరిమితం. మత ప్రచారం చేయడం ఇమ్మిగ్రేషన్, ఫారినర్స్ యాక్ట్ కింద నేరం. అందుకే వారికి దేశం విడిచి వెళ్లాలని నోటీసులు ఇచ్చాం" అని ఆయన స్పష్టం చేశారు. ఇదే కారణంతో .నిఘా పెంచిన పోలీసులుగతంలో కూడా పుణె, పింప్రి చించ్వాడ్ పరిసరాల్లో విదేశీయులు వీసా నిబంధనలు ఉల్లంఘించిన ఘటనలు వెలుగుచూశాయి. ఈ నేపథ్యంలో పోలీసులు విదేశీయుల కదలికలపై నిఘాను మరింత కట్టుదిట్టం చేశారు. పర్యాటకులుగా వచ్చి ఇతర కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఈ ముగ్గురు అమెరికన్లు మే 10 లోపు తమ స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని పోలీసులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.