ఈ ఏడాది అద్భుత విజయాలతో దూసుకుపోతోంది. రాజస్థాన్ రాయల్స్‌తో మొదలుకొని వరకూ . ఈ సీజన్‌లో ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ ఆరు విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. ఈ గెలిచిన ఆరు మ్యాచ్‌లలో కూడా ఆరుగురు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను సొంతం చేసుకున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్‌ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌తో సీజన్‌ను ఆరంభించిన జట్టు తొలి మ్యాచ్‌లో ఓడిపోయింది. అయినా, వెనుకంజ వేయకుండా కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఈడెన్ గార్డెన్స్‌తో చిత్తు చేసింది. ఆ మ్యాచ్‌లో నితీష్ కుమార్ రెడ్డి 39 పరుగులతో పాటు రెండు వికెట్లు తీసుకుని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్‌తో హోం గ్రౌండ్‌ ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బౌలింగ్ మ్యాజిక్‌తో గెలిచింది. అప్పటి వరకు ఓటమి ఎరుగని రాజస్థాన్‌ను ఆరెంజ్ ఆర్మీ చిత్తు చేసింది. ఆ మ్యాచ్‌లో కొత్త బౌలర్ ప్రఫుల్ హింగే తొలి ఓవర్‌లోనే మూడు వికెట్లు తీసి ఓవరాల్‌గా నాలుగు వికెట్లతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఉప్పల్ వేదికగా జరిగిన మరో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మీద కూడా సన్‌రైజర్స్ థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్‌హెచ్ 194/8 పరుగులు చేయగా.. సీఎస్కేను 184/8కే కట్టడి చేసింది. ఇషాన్ మలింగ 4 ఓవర్లలో కేవలం 29 పరుగులే ఇచ్చి మూడు వికెట్లతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. హోం గ్రౌండ్ ఉప్పల్‌లో హ్యాట్రిక్ విక్టరీ నమోదు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 242/2 పరుగులు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ పోరాడినప్పటికీ 195/9 పరుగులే చేయగలిగింది. దాంతో సన్‌రైజర్స్ 47 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. 68 బంతుల్లో 135 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన అభిషేక్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. రాజస్థాన్ రాయల్స్ హోం గ్రౌండ్‌లోనే ఆ జట్టును మరోసారి ఓడించింది. ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ సెంచరీతో రాజస్థాన్ 228/6 పరుగులు చేసినా.. ఆ స్కోర్‌ను సన్‌రైజర్స్ ఛేదించింది. 18.3 ఓవర్లలోనే 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 31 బంతుల్లో 74 పరుగులు చేసిన ఇషాన్ కిషన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. వాంఖడే వేదికగా జరిగిన తాజా మ్యాచ్‌లో ముంబై తొలుత బ్యాటింగ్ చేసి 243/5 భారీ స్కోర్ నమోదు చేసింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్ విధ్వంసంతో కేవలం 18.4 ఓవర్లలోనే 249/4తో సన్‌రైజర్స్ ఘన విజయం సాధించింది. 30 బంతుల్లోనే 65 పరుగులు చేసిన హెన్రిచ్ క్లాసెన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇలా ఆరు విజయాల్లో ఆరుగురు ప్లేయర్లు కీలక పాత్ర పోషించడం సన్‌రైజర్స్ జట్టు పటిష్టతను చూపుతుంది. ఇంకో రెండు విజయాలు సాధిస్తే ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టనుంది.