ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించకున్నా బంగారం ధరల్లో ఊహించని మార్పు.. తనిష్క్, ఖజానా సహా ఏ జువెల్లరీల్లో గ్రాము గోల్డ్ ఎంతంటే?

Wait 5 sec.

22k Gold Rate: బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి అలర్ట్. గత కొంత కాలంగా భారీగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర.. ఇప్పుడు స్వల్పంగా పెరిగింది. అయితే ఇక్కడ బంగారం ధర ఊహించని రీతిలో పెరగడం గమనార్హం. సాధారణంగా ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తే.. డాలర్ డిమాండ్ తగ్గి.. బంగారం ధర పెరుగుతుంటుంది. అదే ఫెడ్ వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచినా.. పెంచినా.. బంగారం ధర తగ్గుతుంటుంది. కానీ ఇప్పుడు దీనికి రివర్స్‌లో బంగారం ధర కిందటి రోజుతో పోలిస్తే స్వల్పంగా పెరిగింది. ఇక్కడ ప్రధాన కారణం.. డాలర్ విలువ తగ్గడం. అవును.. డాలర్ విలువ తగ్గితే.. ఆటోమేటిక్‌గా బంగారం ధర పెరుగుతుంటుంది. ఇతర కారణాలు చూస్తే.. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. ఇరాన్- అమెరికా మధ్య మళ్లీ యుద్ధం వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనాన్ని పొడిగించాలనే యోచనలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉండగా.. అదే జరిగితే తీవ్ర సైనిక చర్యలకు దిగుతామని ఇరాన్ హెచ్చరిస్తోంది. దీంతో ఒక్కసారిగా . ఇదే క్రమంలో స్టాక్ మార్కెట్లలో కూడా భారీ నష్టాలు వస్తున్నాయి. డాలర్ పడిపోయింది. దీంతో.. అనిశ్చితి నేపథ్యంలో సురక్షిత పెట్టుబడి సాధనంగా బంగారానికి డిమాండ్ పెరగడంతో.. ఈసారి ధర తగ్గకుండా పెరిగినట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. దేశీయంగా హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల గోల్డ్ రేటు చూస్తే ప్రస్తుతం ఏప్రిల్ 30న ఉదయం 11 గంటలకు రూ. 200 పెరిగి 10 గ్రాములకు రూ. 1,38,100 వద్ద ఉంది. దీనికి ముందు వరుసగా రూ. 450, రూ. 2550, రూ. 300 చొప్పున తగ్గాయి. 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ. 220 పెరిగి తులం రూ. 1,50,660 కి చేరింది. మరోవైపు వెండి ధర మాత్రం ప్రస్తుతం స్థిరంగానే కేజీకి రూ. 2.60 లక్షల వద్ద ఉంది. దీనికి ముందు వరుసగా 2 రోజుల్లో రూ. 5 వేల చొప్పున తగ్గింది. లేటెస్ట్ గోల్డ్ జువెల్లరీ రేట్లు..దేశంలోని ప్రముఖ జువెల్లరీల్లో చూస్తే లలితా జువెల్లరీలో గ్రాము పసిడి ధర రూ. 13,810 గా ఉంది. తనిష్క్ జువెల్లరీలో గోల్డ్ రేటు గ్రాముకు రూ. 13,915 గా ఉంది. జోయాలుక్కాస్, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, కల్యాణ్ జువెల్లర్స్, ఖజానా జువెల్లరీల్లో కూడా బంగారం ధర గ్రాముకు రూ. 13,810 వద్ద ఉంది. ఇక ఇంటర్నేషనల్ మార్కెట్లో చూస్తే బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయి. కిందటి రోజు స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 4,600 డాలర్లమార్కుపైన ఉండగా.. ఇప్పుడు 4550 డాలర్ల స్థాయికి పడిపోయింది. సిల్వర్ రేటు కూడా 74 డాలర్ల నుంచి 72 డాలర్లకు దిగొచ్చింది. ఇక.. అంతర్జాతీయంగా అనిశ్చితి నేపథ్యంలో.. క్రూడాయిల్ ధరలు భారీగా పెరగ్గా.. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ భారీగా తగ్గి రూ. 95.35 వద్ద ఆల్ టైమ్ కనిష్ఠాల్ని తాకింది.