పసిడి ప్రియులకు అలర్ట్.. భారీగా తగ్గి సడెన్ షాకిచ్చిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం గోల్డ్ ఎంతంటే?

Wait 5 sec.

: పసిడి ప్రియులకు అలర్ట్. ఇటీవల కొంత కాలంగా తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్న మే 2న మళ్లీ స్వల్పంగా పెరిగాయి. కిందటి రోజు భారీగా దిగొచ్చిన సంగతి తెలిసిందే. మళ్లీ ఇప్పుడు సడెన్ షాక్ తగిలింది. హైదరాబాద్ నగరంలో చూస్తే 22 క్యారెట్ల పసిడి ధర ఇవాళ (శనివారం) ఉదయం 11 గంటల సమయంలో రూ. 300 పెరిగి 10 గ్రాములకు రూ. 1,38,350 వద్ద ఉంది. దీనికి ముందటి రోజు చూస్తే ఏకంగా రూ. 1950 తగ్గింది. దానికి ముందటి రోజు రూ. 2100 పెరిగింది. అంతకుముందు వరుసగా రూ. 450, రూ. 2550, రూ. 300 మేర తగ్గుతూ వచ్చింది. మరోవైపు 24 క్యారెట్ల గోల్డ్ రేటు చూస్తే ఇవాళ స్వల్పంగా రూ. 330 పెరగడంతో తులం రూ. 1,50,930 వద్ద ఉంది. ఇది ముందటి రోజు రూ. 2130 తగ్గగా.. దానికి ముందు రూ. 2290 పెరిగింది. అంతకుముందు వరుసగా రూ. 490, రూ. 2780, రూ. 330 తగ్గుముఖం పట్టింది. >> ఇక మరోవైపు వెండి ధరల్ని చూస్తే మే 2 సెషన్‌లో రూ. 5 వేల పెరిగింది. దీంతో హైదరాబాద్ మార్కెట్లో ప్రస్తుతం కేజీ సిల్వర్ రేటు రూ. 2.70 లక్షల వద్ద ఉంది. దీనికి ముందటి రోజు రూ. 5 వేలు తగ్గగా.. దానికి ముందు రూ. 10 వేలు పెరిగింది. అంతకుముందు ఏప్రిల్ 28, 29 సెషన్లలో వరుసగా రూ. 5 వేల చొప్పున తగ్గింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో చూస్తే గోల్డ్, సిల్వర్ రేట్లు కిందటి రోజు భారీ హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. భారీగా తగ్గి.. మళ్లీ పెరిగి తిరిగి యథాతథ స్థితికి చేరుకున్నాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు ప్రస్తుతం 4615 డాలర్ల వద్ద ఉంది. సిల్వర్ రేటు చూస్తే 75.39 డాలర్ల వద్ద ఉంది. ఇక డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ భారీగా పతనం అవుతోంది. ప్రస్తుతం డాలరుతో పోలిస్తే రూ. 94.93 వద్ద ట్రేడవుతోంది. కొద్ది రోజుల కిందటి వరకు విపరీతంగా పెరగ్గా.. బంగారం ధరలు తగ్గుతూ వచ్చాయి. కిందటి రోజు కూడా క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు ఒక దశలో 126 డాలర్ల స్థాయికి చేరుకోగా.. బంగారం ధర భారీగా దిగొచ్చింది. ఏమైందో ఏమో మళ్లీ క్రూడాయిల్ ధర 113 డాలర్ల స్థాయికి దిగొచ్చింది. దీంతో బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయని చెప్పొచ్చు.