ఆసక్తికరంగా మారుతోంది. గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు చివరికి వస్తున్న కొద్దీ టాప్ టీమ్స్ అన్నీ ఒక్కొక్కటిగా ఓడిపోతున్నాయి. మొన్న పంజాబ్, నిన్న పొందాయి. మధ్యలో సన్‌రైజర్స్ మాత్రం గెలిచి స్థిరత్వాన్ని ప్రదర్శిస్తోంది. తాజాగా ఆర్సీబీని ఓడించిన గుజరాత్ టైటాన్స్ ఇప్పుడు ను పూర్తిగా మార్చేలా కనిపిస్తోంది. అహ్మదాబాద్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఘన విజయాన్ని సాధించింది. ఇప్పటికే మైనస్ రన్‌రేట్‌లో ఉన్న గుజరాత్ కాస్తంత మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తోంది. ఆర్సీబీపై 156 పరుగుల లక్ష్యాన్ని కేవలం 16 ఓవర్లలోపే ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో గుజరాత్ తన స్థానాన్ని మెరుగుపరుచుకోకపోయినా.. ప్లే ఆఫ్స్‌కు గట్టి పోటీ ఇచ్చింది. ఈ మ్యాచ్ ఫలితంతో పాయింట్స్ టేబుల్‌లో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన గుజరాత్ టైటాన్స్ ఐదు గెలిచి, నాలుగు ఓడింది. మొత్తం పది పాయింట్లతో -0.192 రన్‌రేట్‌తో ఐదో స్థానంలో కొనసాగుతోంది. గుజరాత్ ఇంకో మ్యాచ్ గెలిస్తే టాప్ 4లో దూసుకుపోయే అవకాశం ఉంది. గుజరాత్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాలంటే మిగిలిన ఐదు మ్యాచ్‌లలో మూడుకు పైగా విజయాలు సాధించాల్సి ఉంది. అదే సమయంలో టాప్ 4లో ఉన్న జట్లు కూడా ఓడిపోతే, గుజరాత్‌కి ప్లే ఆఫ్స్ అవకాశాలు వస్తాయి. గుజరాత్ తన మిగతా ఐదు మ్యాచ్‌లను పంజాబ్, రాజస్థాన్, సన్‌రైజర్స్, కోల్‌కతా, సీఎస్కేతో ఆడనుంది.ఇక గుజరాత్‌పై ఓడిపోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 12 పాయింట్లతో రెండో స్థానంలోనే కొనసాగుతోంది. మొత్తం తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ 6 మ్యాచ్‌లలో విజయం సాధించింది. ఆర్సీబీ మిగతా ఐదు మ్యాచ్‌లలో రెండుకు పైగా విజయాలు సాధిస్తేనే ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టే అవకాశం ఉంటుంది. ఆర్సీబీ తన మిగతా ఐదు మ్యాచ్‌లను లక్నో, ముంబై, కోల్‌కతా, పంజాబ్, సన్‌రైజర్స్‌తో ఆడనుంది. ఐపీఎల్ 2026 పాయింట్స్ టేబుల్‌ను ఒకసారి పరిశీలిస్తే పంజాబ్ కింగ్స్ 13 పాయింట్లతో టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది. ఆర్సీబీ రెండు, సన్‌రైజర్స్ మూడు, రాజస్థాన్ నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి. గుజరాత్ టైటాన్స్ ఐదో స్థానంలో స్థిరపడగా.. చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా ఆరు, ఏడో స్థానాల్లో ఉన్నాయి. కేకేఆర్, ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ రెండ్రెండు విజయాలతో ఎనిమిది, తొమ్మిది, పదో స్థానాల్లో ఉన్నాయి.