డీజిల్, ఏటీఎఫ్‌పై విండ్‌ఫాల్ టాక్స్ తగ్గించిన కేంద్రం.. పెట్రోల్‌పై జీరో.. లేటెస్ట్ రిటైల్ ధరలివే..

Wait 5 sec.

India: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. మే ఒకటో తేదీన కీలక ప్రకటన చేసింది. ఒకవైపు.. .. మరోవైపు చమురు ఎగుమతి కంపెనీలకు మాత్రం ఊరట కల్పించేలా నిర్ణయం తీసుకుంది. దేశీయంగా ఉత్పత్తి అయి విదేశాలకు ఎగుమతి అయ్యే డీజిల్‌పై తాజాగా విండ్‌ఫాల్ గెయిన్స్ టాక్స్‌ను భారీగా తగ్గించింది. అంతకుముందు డీజిల్ ఎగుమతులపై విండ్‌ఫాల్ టాక్స్.. లీటరుపై రూ. 55.5 గా ఉండగా.. ఇప్పుడు దానిని లీటరుకు రూ. 23 కు చేర్చింది. ఇక్కడ దాదాపు 58 శాతానికిపైగా తగ్గడం గమనార్హం. 2026, మే 1 నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. దేశీయంగా విక్రయించే పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీల్లో ఎలాంటి మార్పు చేయలేదు కేంద్రం. ఇదే సమయంలో విమాన ఇంధనం (ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్) ఎగుమతులపైనా విండ్‌ఫాల్ టాక్స్ తగ్గింది. ఏటీఎఫ్‌పై లీటరుకు ఎక్సైజ్ సుంకాన్ని అంతకుముందు 42 గా ఉండగా.. ఇప్పుడు రూ. 33 కు చేర్చింది. ఇది దాదాపు 20 శాతానికిపైగా తగ్గింది. మరోవైపు.. దేశీయంగా ఉత్పత్తి అయి విదేశాలకు ఎగుమతి అయ్యే పెట్రోల్‌‌పై మాత్రం ఎలాంటి విండ్‌ఫాల్ టాక్స్ లేదు. దీనిపై ప్రస్తుతం సున్నాగానే ఉంది. దీనికి అదనంగా డీజిల్ ఎగుమతులపై రోడ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెస్ ఎత్తేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇది మరో 15 రోజుల పాటు అమల్లో ఉంటుందని పేర్కొంది. చాలా కాలం తర్వాత ఇటీవల పశ్చిమాసియాలో . మార్చి 26న దీనిని తీసుకొచ్చింది. అప్పుడు డీజిల్‌పై రూ. 21.50, ఏటీఎఫ్‌పై రూ. 29.5 గా నిర్ణయించింది. ఏప్రిల్ 11న మళ్లీ భారీగా పెంచగా.. ఇప్పుడు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ముందుగా గతంలో రష్యా- ఉక్రెయిన్ యుద్ధం సమయంలో క్రూడాయిల్ ధరలు పెరిగినప్పుడు.. 2022 జులైలో తొలిసారిగా కేంద్రం విండ్‌ఫాల్ టాక్స్ విధానం తీసుకొచ్చింది. అప్పుడు దేశీయంగా చమురు ఉత్పత్తి చేసే కంపెనీలు రిలయన్స్ ఇండస్ట్రీస్, ఓఎన్‌జీసీ వంటివి విదేశాలకు పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ వంటివి ఎగుమతి చేసి భారీగా లాభాల్ని పొందాయి. దీన్ని అడ్డుకునేందుకు.. వాటి లాభాలకు అడ్డుకట్ట వేసి.. దేశీయంగా చమురు సరఫరా పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. అప్పుడు క్రూడాయిల్ ధరల హెచ్చుతగ్గులకు అనుగుణంగా ప్రతి 15 రోజులకు ఓసారి దీనిని సమీక్షించేంది. 2024లో విండ్‌ఫాల్ టాక్స్ విధానం రద్దు..ఇక . దీంతో చమురు ఎగుమతులపై ఎక్సైజ్ డ్యూటీ విధించలేదు. ఇటీవల మళ్లీ ఇరాన్- ఇజ్రాయెల్- అమెరికా యుద్ధం నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు విపరీతంగా పెరగ్గా.. మరోసారి తీసుకొచ్చింది. లేటెస్ట్ పెట్రోల్, డీజిల్ ధరలివే..ఇక దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు ప్రస్తుతం స్థిరంగానే ఉన్నాయి. వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరల్ని పెంచినప్పటికీ.. పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో పెట్రోల్ లీటరుకు రూ. 107.46 గా ఉండగా.. డీజిల్ ధర లీటర్ రూ. 95.70 పలుకుతోంది.