కోహ్లి vs గిల్.. రెండో ఓవర్‌లో ఇద్దరూ పూనకం వచ్చినట్టు కొట్టేశారు!

Wait 5 sec.

క్రికెట్ కింగ్ , ప్రిన్స్ అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పోటాపోటీగా ఆడారు. అనే కంటే కోహ్లి వర్సెస్ గిల్ అనడమే కరెక్ట్‌గా ఉంటుందేమో. ఈ ఇద్దరి మధ్య క్లాష్ ఓ రేంజ్‌లో ఉంది. కోహ్లి బ్యాటింగ్ చేసే సమయంలో గిల్ స్లెడ్జ్ చేయడం, గిల్ బ్యాటింగ్ చేసే సమయంలో కోహ్లి స్లెడ్జ్ చేయడం చూసిన ఫ్యాన్స్‌కి మంచి ఎంటర్‌టైన్‌మెంట్ దొరికింది.అయితే, ఈ ఇద్దరూ బ్యాటింగ్‌లో కూడా పోటాపోటీగానే ఆడారు. ఈ ఇద్దరూ 200కు పైగా రన్‌రేట్‌తో బ్యాటింగ్ చేయడం విశేషం. ఆర్సీబీ ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో విరాట్ కోహ్లి 21 పరుగులు చేస్తే, గుజరాత్ ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో శుభ్‌మన్ గిల్ 24 పరుగులు చేశాడు. దాంతో రెండో ఓవర్‌ చాలా స్పెషల్‌గా మారింది.ఆర్సీబీ బ్యాటింగ్ సమయంలో కగిసో రబడా వేసిన రెండో ఓవర్‌లో విరాట్ కోహ్లి పూనకం వచ్చినట్టు ఆడాడు. తొలి మూడు బంతుల్లో హ్యాట్రిక్ ఫోర్లు బాది వింటేజ్ విరాట్ కోహ్లిని గుర్తుకు తెచ్చాడు. ఆ తర్వాత రెండు బంతుల్లో కూడా రెండు ఫోర్లు బాదాడు. ఆఖరి బంతికి కూడా బౌండరీ బాది వరుసగా ఆరు ఫోర్లు నమోదు చేస్తాడని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ లాస్ట్ బాల్‌కి సింగిల్ మాత్రమే వచ్చింది. దాంతో 4 4 4 4 4 1తో రెండో ఓవర్‌లో 21 పరుగులు నమోదు చేశాడు.విరాట్ కోహ్లికి పోటీగా శుభ్‌మన్ గిల్ కూడా ఆర్సీబీ స్టార్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్‌ను చితకబాదాడు. రెండో ఓవర్ తొలి రెండు బంతుల్లో రెండు ఫోర్లు బాదడంతో, కోహ్లిలాగే హ్యాట్రిక్ బౌండరీలు నమోదు చేస్తాడని అనుకున్నారు. కానీ మూడో బంతి డాట్ అయింది. నాలుగో బంతికి సిక్స్, ఐదో బంతికి 4, ఆరో బంతికి మళ్లీ సిక్స్ బాదడంతో ఆ ఓవర్‌లో ఏకంగా 24 పరుగులు వచ్చాయి.విరాట్ కోహ్లి ఈ మ్యాచ్‌లో 13 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 28 పరుగులు చేసి అవుటయ్యాడు. శుభ్‌మన్ గిల్ 18 బంతుల్లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో 43 పరుగులు చేసి గుజరాత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 155 పరుగులకు ఆలౌట్ కాగా, గుజరాత్ టైటాన్స్ కేవలం 15.5 ఓవర్లలోనే ఈ లక్ష్యాన్ని ఛేదించి ఘన విజయం సాధించింది.