CSK vs MI హై ఓల్టేజ్ మ్యాచ్.. సీఎస్కేపై రివేంజ్‌కి రెడీ, ముంబైకి చావో రేవో మ్యాచ్!

Wait 5 sec.

. రివేంజ్ వీక్‌లో భాగంగా జట్లు ఇందులో తలపడుతున్నాయి. ఇప్పటికే ముంబైను వాళ్ల హోం గ్రౌండ్ వాంఖడేలో చిత్తుచిత్తుగా ఓడించిన సీఎస్కే.. ఇప్పుడు చెపాక్‌లోనూ మరోసారి ఓడించి ప్లే ఆఫ్స్ రేసులో దూసుకుపోవాలని చూస్తుంటే.. ఈ మ్యాచ్‌లో గెలిచి ఎలాగైనా రేసులో నిలవాలని ముంబై ఇండియన్స్ చూస్తోంది. చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లైవ్‌ను స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ వేదికగా వీక్షించొచ్చు. ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ దాదాపు ఒకే స్థితిలో ఉన్నాయి. సీజన్ ఆరంభంలో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి పడిపోయిన చెన్నై.. ఆ తర్వాత వరుస విజయాలతో పైకి ఎగబాకి, ఐదో స్థానం నుంచి మళ్లీ ఇప్పుడు ఏడో స్థానానికి పడిపోయింది. విజయంతో సీజన్‌ను ఆరంభించిన ముంబై ఇండియన్స్, ఆ తర్వాత వరుసగా ఓడిపోతూ వస్తూ గుజరాత్‌పై భారీ తేడాతో గెలిచింది. ఇక మళ్లీ వరుస విజయాలే అనుకుంటే.. అన్నింటిలోనూ ఓడిపోతూ పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానానికి పడిపోయింది. చెపాక్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో ఏ జట్టు అయితే గెలుస్తుందో దానికే ప్లే ఆఫ్స్ రేసులో ముందకెళ్లే ఛాన్స్ ఉంటుంది. దాంతో ఈ మ్యాచ్ హోరా హోరీగా సాగే అవకాశం ఉంది. ఐపీఎల్‌ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య 40 మ్యాచ్‌లు జరిగితే ముంబై 21 మ్యాచ్‌లలో గెలవగా, చెన్నై 19 మ్యాచ్‌లలో విజయం సాధించింది. 2023 నుంచి జరిగిన ఆఖరి ఆరు మ్యాచ్‌లలో సీఎస్కే అత్యధికంగా ఐదు గెలవగా, ముంబై ఒక్కటే విజయం సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అంచనారుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సంజూ శాంసన్, సర్ఫరాజ్ ఖాన్, డివాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, కార్తిక్ శర్మ/ఎంఎస్ ధోనీ, జెమీ ఓవర్టన్, ప్రశాంత్ వీర్ / అకేలా హోసెన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, స్పెన్సర్ జాన్సన్ / ముకేశ్ చౌదరి, గుర్‌జపనీత్ సింగ్.ముంబై ఇండియన్స్ జట్టు అంచనార్యాన్ రికెల్టన్, విల్ జాక్స్, నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రాబిన్ మిన్జ్, శార్ధూల్ ఠాకూర్, కార్బిన్ బాష్/ ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, ఘజనాఫర్, మయాంక్ మార్కండే.