శనివారం రోజు ఆ సమయంలో మీ ఫోన్లలో బీప్ సౌండ్ రావొచ్చు.. భయపడకండి..

Wait 5 sec.

శనివారం రోజు మధ్యాహ్నం మీ మొబైల్ ఫోన్ల నుంచి ఉన్నట్లుండి బీప్ సౌండ్ రావొచ్చు. లేదా నోటిఫికేషన్, టెస్ట్ మెసేజ్ కూడా వచ్చే అవకాశం ఉంది. అంతమాత్రాన మీరు భయపడిపోకండి అంటూ మొబైల్ వినియోగదారులను అప్రమత్తం చేసింది. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ దేశవ్యాప్తంగా అత్యవసర హెచ్చరికల వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇందులో భాగంగా, శనివారం ఉదయం 11:15 గంటల నుంచి మధ్యాహ్నం 12:15 గంటల మధ్య ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతాల్లోని మొబైల్ ఫోన్లకు పరీక్షా సందేశాలను పంపిస్తారని తెలిపింది. ఈ క్రమంలోనే మీ మొబైల్ ఫోన్‌కు శబ్దం (Beep Sound), వైబ్రేషన్‌తో కూడిన నోటిఫికేషన్ లేదా టెస్ట్ మెసేజ్ వస్తుందని.. ప్రజలు భయాందోళనలకు గురికావద్దని తెలిపింది. ఇది కేవలం సాంకేతిక పరీక్ష మాత్రమేనన్న ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ, దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరంలేదని స్పష్టం చేసింది.శనివారం ఈ జిల్లాలలో వానలుమరోవైపు నెలకొని ఉంది. .. . ఈ క్రమంలోనే శనివారం రోజున ఉత్తరాంధ్ర, తిరుపతి, చిత్తూరు జిల్లాలో వానలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ద్రోణి ప్రభావంతో చిత్తూరు, తిరుపతి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. అలాగే ఆది, సోమవారాల్లో కొన్ని జిల్లాల్లో ఎండతీవ్రత స్వల్పంగా తగ్గి మేఘావృత వాతావరణం, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ అంచనా వేశారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. శనివారం ఈ జిల్లాల్లో వడగాల్పులు మరోవైపు శనివారం రోజున ఏపీలోని పలు జిల్లాలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. అలాగే 64 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. పల్నాడు జిల్లాలోని 19 మండలాలతో పాటు పార్వతీపురం మన్యం, ప్రకాశం జిల్లాలలోని 10 చొప్పున మండలాలు, విజయనగరం 8, మార్కాపురం జిల్లాలోని 6 మండలాలు, తిరుపతి 4, పోలవరం 2, ఎన్టీఆర్ 1, గుంటూరు1, నెల్లూరు 3, తిరుపతి జిల్లాలోని నాలుగు మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఎండ తీవ్రత, ఉక్కపోత పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించింది.