FD లపై బంపరాఫర్.. SBI, HDFC సహా టాప్ బ్యాంకుల్లో ఏ టెన్యూర్‌పై వడ్డీ రేటు ఎక్కువ? ఫుల్ లిస్ట్ ఇదే..

Wait 5 sec.

: సీనియర్ సిటిజెన్లకు పెద్దగా స్థిర ఆదాయం ఉండదు. వారికి కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే పెన్షనే ఆధారం. ఇంకా రిటైర్మెంట్ తర్వాత కూడా నెలనెలా జీతం రాదు. కాబట్టి.. వీరు పెద్దగా రిస్క్ లేకుండా మంచి రాబడి అందుకునే వాటిల్లో తమ పొదుపుల్ని ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఇందులో ఎక్కువ మంది ఎంచుకునే ఆప్షన్ . అవును.. ఇక్కడ స్థిర కాలానికి.. ఉదాహరణకు ఏడాది, రెండేళ్లు, మూడేళ్లు, ఐదేళ్లు ఇలా డిపాజిట్ చేస్తుంటారు. ఆర్బీఐ రెపో రేట్లను తగ్గిస్తూ వచ్చిన క్రమంలో చాలా బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు తగ్గాయి. అయినప్పటికీ ఇప్పటికీ కొన్ని బ్యాంకులు అధిక వడ్డీ ఇస్తున్నాయి. ముఖ్యంగా సీనియర్ సిటిజెన్లు.. సాధారణ ప్రజలతో పోలిస్తే సుమారు 50 బేసిస్ పాయింట్ల వరకు ఎక్కువ వడ్డీ అందుకుంటున్నారు. >> డిపాజిట్లు చేసే ముందు బ్యాంకుల్లో వడ్డీ రేట్లను పోల్చుకోవడం అత్యంత ముఖ్యం. వడ్డీ రేటులో కాస్త తేడా వచ్చినా.. చివరికి వచ్చే రాబడిలో కూడా పెద్ద మొత్తంలో తేడా ఉంటుంది. అందుకే మీ టెన్యూర్‌ను బట్టి వడ్డీ దేంట్లో ఎలా ఉందో చూసుకోవాలి. ఇక ప్రభుత్వ బ్యాంకుల కంటే.. ప్రైవేట్ బ్యాంకుల్లో.. ప్రైవేటులో కంటే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో వడ్డీ అధికంగా వస్తుంది. ఇప్పుడు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, ప్రభుత్వ బ్యాంకులు.. దేంట్లో వడ్డీ రేట్లు సీనియర్ సిటిజెన్లకు ఏ టెన్యూర్‌కు ఎక్కువగా ఉన్నాయో తెలుసుకుందాం. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో సీనియర్ సిటిజెన్లకు అత్యధికంగా 501 రోజుల టెన్యూర్‌పై ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 8.50 శాతం వడ్డీ అందిస్తుంది. శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు 21 నెలల ఒక రోజు నుంచి 22 నెలల డిపాజిట్లపై 8.30 శాతం వడ్డీ అందిస్తుంది. సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు 30 నెలల టెన్యూర్‌కు 8.25 శాతం వడ్డీ ఇస్తుంది. ప్రైవేట్ బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు..ప్రైవేట్ బ్యాంకుల విషయానికి వస్తే ఎస్బీఎం బ్యాంక్ ఇండియాలో 391 రోజుల నుంచి 15 నెలల టెన్యూర్‌పై చూస్తే అత్యధికంగా 8.35 శాతంగా ఉంది. బంధన్ బ్యాంకులో 2 ఏళ్ల నుంచి ఐదేళ్ల వరకు డిపాజిట్లపై 7.75 శాతంగా వడ్డీ రేటు ఉంది. కోటక్ మహీంద్రా బ్యాంకులో 2-3 ఏళ్ల డిపాజిట్లపై 7.3 శాతంగా వడ్డీ రేటు ఉంది. యాక్సిస్ బ్యాంకులో 5- 10 ఏళ్ల వ్యవధి డిపాజిట్లపై 7.2 శాతంగా ఉంది. ఐసీఐసీఐ బ్యాంకులో 3 ఏళ్ల ఒక రోజు నుంచి ఐదేళ్ల వ్యవధి డిపాజిట్లపై 7.10 శాతంగా వడ్డీ రేటు ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో 3 ఏళ్ల ఒక రోజు నుంచి 4 ఏళ్ల 7 నెలల డిపాజిట్లపై 7 శాతంగా వడ్డీ రేటు ఉంది. ప్రభుత్వ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు..ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో చూస్తే.. 666 రోజుల డిపాజిట్‌పై పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ అత్యధికంగా 7.25 శాతం వడ్డీ ఆఫర్ చేస్తుంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 400 రోజుల వ్యవధిపై 7.15 శాతం వడ్డీ వస్తుంది. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 450 రోజుల ప్రత్యేక డిపాజిట్‌పై 7.10 శాతంగా వడ్డీ రేటు ఉంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 444 రోజులకు 7.10 శాతం వడ్డీ రేటు ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు డిపాజిట్లపై 7.05 శాతంగా ఉంది.