అనంతపురం జిల్లాశ్రీకి చేదు అనుభవం ఎదురైంది. తనకు అన్యాయం చేశారంటూ సొంత పార్టీ కార్యకర్త, అతని కుటుంబంనిలదీశారు. ఓ మహిళ పోలీసులను నెట్టేసుకుని ఎమ్మెల్యే వైపు దూసుకురావటం ఉద్రిక్తతలకు దారితీసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గార్లదిన్నె మండ‌లంలోని క‌ణంప‌ల్లిలో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు గానూ కణంపల్లి గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు ఆమెకు ఘన స్వాగతం పలికాయి. అయితే తమకు అన్యాయం చేశారంటూ ప్రసాద్ అనే టీడీపీ కార్యకర్త, ఆయన కుటుంబసభ్యులు నిరసనకు దిగటం ఉద్రిక్తతకు దారి తీసింది. గతంలో తను ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇచ్చారని.. తీరా ఇప్పుడు అడుగుతుంటే అక్రమ కేసులు పెడుతున్నారంటూ ప్రసాద్, అతని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే ఓ మహిళ పోలీసులను తోసుకుంటూ ఎమ్మెల్యేవైపు వచ్చేందుకు ప్రయత్నించడం కలకలం రేపింది. అయితే పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. అనంతరం అక్కడి నుంచి వారిని పక్కకు తొలగించారు. ఆ తర్వాత ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ యథావిధిగా తన కార్యక్రమాన్ని కొనసాగించారు. మరోవైపు కణంపల్లిలో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు చేయటం చాలా సంతోషంగా ఉందన్నారు బండారు శ్రావణి. దీంతో తమ ప్రాంతంలో చ‌దువుకున్న యువతకు ఉద్యోగాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటులో భాగంగా భూములు కోల్పోయిన రైతులకు ప‌రిహారం అంద‌జేయ‌డం సంతోషంగా ఉందన్నారు. శింగనమల ప్రాంత అభివృద్ధికి కృష్టి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. మరోవైపు గతంలోనూ బండారు శ్రావణిని స్థానికులు అడ్డుకున్న ఘటన చోటుచేసుకుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, తమ సమస్యలను పరిష్కరించలేదని గత ఫిబ్రవరి నెలలో పింఛన్ల పంపిణీ సందర్భంగా నాగులగుడ్డం గ్రామంలో స్థానికులు ఎమ్మెల్యేను నిలదీశారు. తాజాగా మరోసారి ఇలాంటి ఘటన పునరావృతమైంది.