తగ్గిన క్రూడాయిల్ ధర.. మళ్లీ దిగొచ్చిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో లేటెస్ట్ రేట్లు ఇవే..

Wait 5 sec.

Latest Gold Silver Rates: భారతదేశంలో బంగారానికి విపరీతంగా డిమాండ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఎక్కువగా మహిళలు.. పండగలు, వివాహాలు ఇతర శుభకార్యాల సమయంలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు చూస్తుంటారు. వీరు అలంకరణకే ఎక్కువగా మొగ్గుచూపుతుంటారు. ఇటీవలి కాలంలో బంగారం కేవలం అలంకరణగానే కాకుండా.. పెట్టుబడికి మంచి సాధనంగా పనిచేస్తుంది. మార్చితో ముగిసిన తొలి త్రైమాసికంలో ఊహించని రీతిలో ఆభరణాల డిమాండ్ కంటే.. పెట్టుబడి డిమాండ్ అధికంగా ఉండటం విశేషం. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్ ప్రకారం.. . బంగారు ఆభరణాల ధర ఇటీవల విపరీతంగా పెరగడమే ఇందుకు కారణం. అయితే ఇటీవల మళ్లీ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్న సంగతి తెలిసిందే. ఒకరోజు పెరుగుతుంటే.. మరో రోజు తగ్గుతుంది. ఇప్పుడు మే 1న బంగారం, వెండి ధరలు దిగొచ్చాయి. దేశీయంగా, అంతర్జాతీయంగా తగ్గుముఖం పట్టాయి. ఒకవైపు ఇంటర్నేషనల్ మార్కెట్లో.. ముడి చమురు ధరలు కిందటి రోజు భారీగా పెరిగి మళ్లీ ఆఖర్లో తగ్గడంతో బంగారం ధరలు కూడా తగ్గాయి. క్రూడాయిల్ ధర ఒక దశలో బ్యారెల్‌కు 125 డాలర్ల మార్కు దాటగా.. మళ్లీ ఆఖర్లో 113 డాలర్లకు పడిపోయింది. దీంతో పసిడి ధరలు తగ్గాయి. హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల గోల్డ్ రేటు మే 1న ఉదయం 11 గంటల సమయంలో చూస్తే రూ. 350 తగ్గి 10 గ్రాములకు రూ. 1,39,650 కి చేరింది. ముందటి రోజు భారీగా రూ. 2100 పెరిగింది. దానికి ముందు వరుసగా రూ. 450, రూ. 2550, రూ. 300 మేర తగ్గింది. మరోవైపు 24 క్యారెట్ల మేలిమి బంగారం రేటు రూ. 380 పతనం కాగా.. తులం రేటు రూ. 1,52,350 వద్ద ఉంది. ఇది ముందటి రోజు రూ. 2,290 పెరిగింది. 18 క్యారెట్ల బంగారం ధర రూ. 290 తగ్గి తులం రూ. 1,14,260 గా ఉంది. వెండి ధర విషయానికి వస్తే ఇవాళ రూ. 5 వేలు తగ్గడంతో కేజీకి హైదరాబాద్ నగరంలో రూ. 2.65 లక్షల వద్ద ఉంది. ముందటి రోజు రూ. 10 వేలు పెరగ్గా.. దానికి ముందు వరుసగా 2 రోజులు రూ. 5 వేల మేర దిగొచ్చింది. ఇక ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా రేట్లు భారీగానే దిగొచ్చాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు ప్రస్తుతం 4600 డాలర్ల దిగువన ఉండగా.. సిల్వర్ రేటు 74 డాలర్లకు చేరింది. ఇక డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ భారీగా తగ్గి రూ. 94.92 వద్ద ఉంది.