పిల్లాడిని చంపేస్తావా ఏంటీ.. వైభవ్‌ను అవుట్ చేశాక జెమీసన్ సెలబ్రేషన్స్ వైరల్!

Wait 5 sec.

ఇప్పుడు ఐపీఎల్‌లోనే టఫ్ఫెస్ట్ బ్యాటర్. ఈ బుడ్డోడికి బౌలింగ్ చేయాలంటేనే వరల్డ్ క్లాస్ బౌలర్లే జంకుతున్నారు. పవర్ ప్లే వరకూ . అతనే హాఫ్ సెంచరీ చేసుకుని.. జట్టు స్కోర్‌ను సెంచరీ వరకూ తీసుకెళ్తాడు. అందుకే . కానీ వైభవ్ వికెట్ తీసిన తర్వాత జెమీసన్ చేసిన సెలబ్రేషన్ మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. జైపూర్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరంభంలోనే అవుటయ్యాడు. అప్పటికీ ఫస్ట్ బాలే బౌండరీ బాదిన వైభవ్ ఆ తర్వాత బంతిని సిక్సర్‌గా మలచాలనుకున్నాడు. కానీ, జెమీసన్ తన అనుభవాన్నంతా ఉపయోగించి స్లో యార్కర్‌తో క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో వైభవ్ తన ఎదుర్కొన్న రెండో బంతికే పెవిలియన్ బాట పట్టాల్సి వచ్చింది. అయితే, వైభవ్‌ను అవుట్ చేసిన ఆనందంలో ఓవర్ సెలబ్రేషన్‌లో మునిగిపోయాడు. పదిహేనేళ్ల బుడ్డోడు అన్న విషయాన్ని మరిచి పెద్ద పెద్దగా అరుస్తూ, చప్పట్లు కొడుతూ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. చూసునోళ్లకు ఇది పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా కనిపించినా.. ఢిల్లీకి మాత్రం చాలా కీలక వికెట్ అని క్రికెట్ అనుభవం ఉన్న ప్రతి ఒక్కరికీ అర్థమవుతుంది. ఏదేమైనా ఆరంభంలోనే వైభవ్‌ను అవుట్ చేసి ఢిల్లీ జట్టు కొంత సక్సెస్ అయింది. 2025తో ఐపీఎల్‌లో అడుగుపెట్టిన వైభవ్ సూర్యవంశీ 35 బంతుల్లోనే సెంచరీ చేసి గేల్ తర్వాత తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన ఏకైక ప్లేయర్‌గా నిలిచాడు. ఈ సీజన్‌లో కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 36 బంతుల్లోనే సెంచరీ చేసి సత్తా చాటాడు. ఐపీఎల్ 2026లో ఇప్పటి వరకు పది మ్యాచ్‌లు ఆడిన వైభవ్ సూర్యవంశీ 404 పరుగులు చేసి.. ఆరెంజ్ క్యాప్ లిస్ట్‌లో టాప్ 4లో కొనసాగుతున్నాడు. అందులో ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.