IPL 2026: పాయింట్స్ టేబుల్ టాపర్‌గా ఇంకా పంజాబే.. సేఫ్‌లో సన్‌రైజర్స్, డేంజర్‌లో ముంబై

Wait 5 sec.

ఆరంభం నుంచి ఇప్పటి వరకు టేబుల్ టాపర్‌గా పంజాబ్ కింగ్సే కొనసాగుతోంది. సీజన్‌లో రివేంజ్ టైమ్ నడుస్తున్నా.. పంజాబ్ కింగ్స్ కేవలం ఒక్కటంటే ఒక్క మ్యాచ్‌లోనే ఓడిపోయింది. సగం సీజన్ వరకూ ఒక్క ఓటమి కూడా చూడని . ఇక సీజన్‌లో విజయంతో ఆరంభించిన . ఐపీఎల్ పాయింట్స్ టేబుల్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు 8 మ్యాచ్‌లలో ఒక్కదాంట్లోనే ఓడిపోయి 13 పాయింట్లతో టేబుల్ టాప్‌లో నిలిచింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు సరిసమాన విజయాలతో ఉన్నప్పటికీ రన్‌రేట్ ఆధారంగా ఆర్సీబీ రెండో స్థానంలో ఉండగా, సన్‌రైజర్స్ మూడో స్థానంలో నిలిచింది. ఆర్సీబీ 9 మ్యాచ్‌లు ఆడి ఆరు గెలిచి 12 పాయింట్లతో +1.420 రన్‌రేట్‌తో కొనసాగుతుండగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ 9 మ్యాచ్‌లలో 6 గెలిచి 12 పాయింట్లతో +0.832తో ఉంది. రాజస్థాన్ రాయల్స్ జట్టు పది మ్యాచ్‌లలో ఆరు గెలిచి, నాలుగు ఓడి 12 పాయింట్లతో +0.510 రన్‌రేట్‌తో నాలుగో స్థానంలో నిలిచింది.గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు ఐదు, ఆరు స్థానాల్లో ఉండి ప్లే ఆఫ్స్ రేసులో దూసుకొస్తున్నాయి. గుజరాత్ టైటాన్స్ 9 మ్యాచ్‌లలో ఐదు గెలిచి, నాలుగు ఓడి 10 పాయింట్లతో ఐదో స్థానంలో ఉండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 9 మ్యాచ్‌లలో నాలుగు గెలిచి, ఐదు ఓడి ఎనిమిది పాయింట్లతో ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఐదుసార్ల ఐపీఎల్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు మరోసారి నిరాశపరిచాయి. సీఎస్కే 8 మ్యాచ్‌లలో మూడు గెలిచి, ఐదు ఓడిపోయింది. ఆరు పాయింట్లతో ఏడో స్థానంలో నిలవగా.. ముంబై ఇండియన్స్ దారుణంగా 8 మ్యాచ్‌లలో కేవలం రెండు మాత్రమే గెలిచి ఆరింటిలో ఓడిపోయింది. 4 పాయింట్లతో తొమ్మిదో స్థానానికి పడిపోయింది. కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా 8 మ్యాచ్‌లలో రెండు మాత్రమే గెలిచినప్పటికీ, ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో ఐదు పాయింట్లు వచ్చాయి. దాంతో పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో నిలిచింది. హార్డ్ హిట్టర్స్ ఉన్న పంత్ టీమ్ ఈ ఏడాది చెత్త ప్రదర్శన చేసింది. 8 మ్యాచ్‌లలో రెండంటే రెండు మాత్రమే గెలిచి నాలుగు పాయింట్లతో అట్టడుగు స్థానంలో నిలిచింది. సీజన్ ముగిసేలోపు పై స్థానాలకు వెళ్లాలని గోయెంకా టీమ్ చూస్తోంది.