దగ్గరపడుతున్న కొద్దీ కేవలం మన జట్టు ప్రదర్శనే కాదు, అవతలి జట్ల విజయాపజాయాలు కూడా పాయింట్ల టేబుల్ మీద ప్రభావం చూపుతాయి. ఏప్రిల్ 26 తర్వాత . వరుసగా గుజరాత్, ఢిల్లీ మ్యాచ్‌లు గెలవడమే ఇందుకు కారణం. గుజరాత్ ఐదులో, ఢిల్లీ ఆరులోకి రాగా.. సీఎస్కే నెంబర్ 7లో ఫిక్స్ అయింది. గ్రూప్ దశ దగ్గర పడుతున్న కొద్దీ మ్యాచ్‌లు ఆసక్తిగా జరుగుతున్నాయి. ప్రతీ జట్టుకూ ఇప్పటికీ ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉండటంతో చావో రేవో అన్నట్టు తలపడుతున్నాయి. ఇప్పటికే టాప్ 4లో ఉన్న జట్లు ఈజీగా ప్లే ఆఫ్స్‌కు వెళ్తాయి అనుకుంటే, అవి కూడా ఒక్కొక్కటిగా ఓడిపోతూ వస్తుండటంతో మరింత ఆసక్తి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏడో స్థానంలో ఉన్న ప్లే ఆఫ్స్‌కు వెళ్తుందా? లేదా? అన్నది ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్స్ 8 మ్యాచ్‌లు ఆడి కేవలం మూడు మాత్రమే గెలిచింది. ఆరు పాయింట్లతో ఏడో స్థానానికి దిగజారింది. ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టాలంటే ఒక్కో జట్టుకు కచ్చితంగా 16 పాయింట్లు కావాలి. అంటే ఇప్పుడు సీఎస్కే ప్లే ఆఫ్స్ బరిలో నిలవాలంటే ఇంకో పది పాయింట్లు కావాలి. అంటే సీఎస్కే తనకు మిగిలిన ఆరు మ్యాచ్‌లలో ఐదు కచ్చితంగా గెలవాల్సిందే. ఇలా గెలిస్తేనే సీఎస్కేకు ప్లే ఆఫ్స్ ఛాన్స్‌లు వస్తాయి. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తన చివరి ఆరు మ్యాచ్‌లను ముంబై, ఢిల్లీ, లక్నో, సన్‌రైజర్స్, గుజరాత్ జట్లతో ఆడనుంది. మే 2న ముంబైతో, మే 5న ఢిల్లీ, మే 10న లక్నో, మే 15న మళ్లీ లక్నోతో, మే 18న సన్‌రైజర్స్, మే 21న గుజరాత్‌తో తలపడనుంది. ఇందులో సన్‌రైజర్స్ టాప్ 3లో కొనసాగుతుండగా.. గుజరాత్, ఢిల్లీ జట్లు టాప్ 4లో అడుగుపెట్టాలని చూస్తున్నాయి. దాంతో ఇంత టఫ్ కాంపిటీషన్‌ను దాటుకుని సీఎస్కే ప్లే ఆఫ్స్‌లో అడుగుపెడుతుందా? లేదా? అన్నది ఆసక్తిగా మారింది.