బెంగాల్‌లోని 15 చోట్ల రేపే రీ-పోలింగ్.. మరో 30‌పై నిర్ణయం తీసుకోనున్న ఈసీ

Wait 5 sec.

పశ్చిమ్ బెంగాల్‌లోని రెండు నియోజకవర్గాల్లోని 15 బూత్‌లలో రీ-పోలింగ్‌ నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల కమిషన్ శుక్రవారం ప్రకటించింది. పోలింగ్ సమయంలో అక్రమాలు జరిగాయనే ఫిర్యాదుల నేపథ్యంలో డైమండ్ హార్బర్, మగ్రాహట్ వెస్ట్ నియోజకవర్గాల్లోని 15 బూత్‌లలో తిరిగి పోలింగ్ నిర్వహిస్తున్నట్లు ఈసీ తెలిపింది. మగ్రాహట్ పశ్చిమ్‌లోని 11, డైమండ్ హార్బర్‌లోని 4 కేంద్రాలలో శనివారం జరుగుతుందని ఈసీ ఈ మేరకు ఉత్తర్వులు వెలువరించింది. అయితే, వీటితోపాటు 30 కేంద్రాల్లోనూ రీ-పోలింగ్ జరిపించాలని బీజేపీ కోరుతోంది. దీనిని కూడా ఈసీ పరిశీలిస్తోంది. ఏప్రిల్ 29న రెండో దశ పోలింగ్ రోజున వైరల్ అయిన విషయం తెలిసిందే. ‘‘పశ్చిమ బెంగాల్ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఏప్రిల్ 29న నిర్వహించిన పోలింగ్‌కు సంబంధించి మగ్రాహత్ వెస్ట్, డైమండ్ హార్బర్ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, పరిశీలకుల నుంచి అందిన నివేదికలు, మరికొన్ని కీలక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 58 సబ్ -సెక్షన్ (2) ప్రకారం పైన పేర్కొన్న రెండు స్థానాల్లో కింది పోలింగ్ స్టేషన్లలో ఏప్రిల్ 29న నిర్వహించిన పోలింగ్‌ చెల్లదు.. సదరు పోలింగ్ స్టేషన్లలో మే 2న రీ-పోలింగ్ నిర్వహిస్తున్నాం’’ అని బెంగాల్ ప్రధాన ఎన్నికల అధికారి తన ఉత్తర్వులో పేర్కొన్నారు. మొత్తం 15 బూత్‌లలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరుగుతుందని తెలిపారు.‘పోలింగ్ జరిగే ప్రాంతంలో చాటింపు ద్వారా వీలైనంత విస్తృత ప్రచారం కల్పించాలి.. అలాగే రీ-పోలింగ్ జరుగుతుందని పోటీ చేస్తున్న అభ్యర్థులకు లిఖితపూర్వకంగా తెలియజేయాలి’’ అని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. బెంగాల్‌లో మొత్తం 294 స్థానాలకు రెండు దశల్లో పోలింగ్ నిర్వహించారు. నమోదయినట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. తొలి దశలో 152 సీట్లకు ఏప్రిల్ 23న జరిగిన పోలింగ్‌లో 93.19 శాతం ఓటింగ్ నమోదయ్యింది. రెండో దశలోనూ 92 శాతం దాటింది. మే 4న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు.