ధర రూ.7 మాత్రమే.. ఉచితంగా 2 షేర్లు ఇస్తోన్న ఐటీ కంపెనీ.. పూర్తి వివరాలు ఇవే

Wait 5 sec.

: స్మాల్ క్యాప్ కేటగిరిలోని ఐటీ సెక్టార్ కంపెనీ స్ట్రింగ్ మెటావర్స్ లిమిటెడ్ () తమ షేర్ హోల్డర్లకు బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. ఏప్రిల్ 30వ తేదీన జరిగిన కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో 2:9 రేషియోలో బోనస్ షేర్లు జారీ చేసేందుకు ఆమోదం లభించింది. ఈ బోనస్ ప్రకారం 9 షేర్లు కొనుగోలు చేసి ఉన్న వారికి అదనంగా 2 షేర్లు ఉచితంగా లభిస్తాయి. మరోవైపు ఈ కంపెనీ షేర్ గత ఏడాదిలో కేవలం 1 శాతం లాభాన్ని ఇచ్చింది. స్ట్రింగ్ మెటావర్స్ లిమిటెడ్ రూ.10 లోపు ధర గల ఒక పెన్నీ స్టాక్. మరి ఈ స్టాక్ గురించిన వివరాలు ఇప్పుడే మనం తెలుసుకుందాం. కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం.. ఏప్రిల్ 30వ తేదీన జరిగిన కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో 2:9 రేషియోలో బోనస్ షేర్లు జారీ చేసేందుకు బోర్డు డైరెక్టర్స్ ఆమోదం తెలిపారు. దీని అర్థం రికార్డు తేదీ నాటికి రూ. 1 ఫేస్ వ్యాల్యూ ఉన్న 9 ఈక్విటీ షేర్లను తమ డీమ్యాట్ అకౌంట్లో కలిగి ఉన్నవారికి అదనంగా రూ. 1 ఫేస్ వ్యాల్యూ ఉండే 2 ఈక్విటీ షేర్లను ఉచితంగా జారీ చేసేందుకు కంపెనీ డైరెక్టర్స్ బోర్డు ఆమోదం తెలిపింది. అయితే ఈ బోనస్ షేర్లు పొందేందుకు అర్హులైన షేర్ హోల్డర్లను నిర్ణయించే రికార్డు తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు కంపెనీ తెలిపింది. స్టాక్ మార్కెట్ చివరి ట్రేడింగ్ సెషన్ లో స్ట్రింగ్ మెటావర్స్ లిమిటెడ్ షేరు 4.69 శాతం లాభంతో రూ. 10.05 వద్ద ముగిసింది. ఈ షేరు 52 వారాల గరిష్ఠ ధర రూ. 32.44 వద్ద ఉండగా 52 వారాల కనిష్ఠ ధర రూ. 7.20 వద్ద ఉంది. గత వారం రోజుల్లో ఈ షేరు 15 శాతం లాభాన్ని అందించింది. గత నెల రోజుల్లో 12 శాతం నష్టాన్ని మిగిల్చింది. గత ఆరు నెలల్లో 66 శాతం నష్టాన్ని ఇచ్చింది. గత ఏడాది కాలంలో 1 శాతం లాభాన్ని అందించింది. గత 17 నెలల్లో 505 శాతం లాభాన్ని అందించింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 1170 కోట్లుగా ఉంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడిపై హైరిస్క్ ఉంటుంది. కొనుగోలు చేయాలనుకుంటున్న స్టాక్ గురించి ముందే తెలుసుకోవడం చాలా అవసరం. నిపుణుల సలహాలు తీసుకుని ముందుకు వెళ్లడం ద్వారా సురక్షితంగా ఉండే అవకాశం ఉంటుంది.