ఒకటో తేదీ గుడ్‌న్యూస్.. వడ్డీ రేట్లు భారీగా పెంచిన బజాజ్ ఫైనాన్స్.. 2 లక్షలు జమ చేస్తే ఎంతొస్తుందంటే?

Wait 5 sec.

: మార్కెట్ విలువ పరంగా భారతదేశంలోనే అతిపెద్ద నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (NBFC) బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్.. శుభవార్త చెప్పింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఎంపిక చేసిన టెన్యూర్లపై వడ్డీ రేట్లు భారీగా పెంచేసింది. గరిష్ఠంగా 45 బేసిస్ పాయింట్ల వరకు పెంచేయగా.. ఈ వడ్డీ రేట్ల పెంపు 2026, మే నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు.. సీనియర్ సిటిజెన్లకు అధిక రాబడి అందించాలన్న ఉద్దేశంతో వడ్డీ రేట్లను పెంచినట్లు తెలిపింది. అత్యధికంగా ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్.. 31-60 నెలల టెన్యూర్ డిపాజిట్‌పై వడ్డీ రేట్లను పెంచింది.ఇక్కడ వడ్డీ రేట్లను 45 బేసిస్ పాయింట్లు లేదా 0.45 శాతం మేర పెంచగా.. ఇప్పుడు జనరల్ కస్టమర్లకు ఇక్కడ అత్యధికంగా వడ్డీ రేటు 7.40 శాతంగా ఉంది. ఇక ఇదే టెన్యూర్ డిపాజిట్‌పై సీనియర్ సిటిజెన్లకు అత్యధికంగా 7.75 శాతంగా వడ్డీ రేటు ఉంది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సెక్టార్‌లో అత్యధిక వడ్డీ రేట్లు అందించే వాటిల్లో బజాజ్ ఫైనాన్స్ ముందు వరుసలో ఉంది. టెన్యూర్లను కూడా మార్చేసింది.సాధారణ ప్రజలకు 12-14 నెలల డిపాజిట్లపై అంతకుముందు 6.60 శాతం వడ్డీ రేటు ఉండగా.. ఇప్పుడు దీనిని 12-17 నెలల టెన్యూర్‌గా మార్చింది. వడ్డీ రేట్లను మార్చలేదు. సీనియర్ సిటిజెన్లకు ఇక్కడ వడ్డీ రేటు 6.95 శాతంగా ఉంది.15-23 నెలల టెన్యూర్ డిపాజిట్‌పై సాధారణ ప్రజలకు అంతకుముందు వడ్డీ రేటు 6.75 శాతంగా ఉండగా.. 10 బేసిస్ పాయింట్లు పెంచేసింది. టెన్యూర్‌ను 18-30 నెలలకు మార్చింది. సీనియర్ సిటిజెన్లకు వడ్డీ రేటు 7.20 శాతంగా ఉంది.ఇక 24-60 నెలల డిపాజిట్లపై సాధారణ ప్రజలకు అంతకుముందు వడ్డీ రేట్లు 6.95 శాతంగా ఉండగా.. 45 బేసిస్ పాయింట్లు పెంచి 7.40 శాతానికి చేర్చింది. ఇక్కడ టెన్యూర్ 31-60 నెలలుగా మార్చింది. సీనియర్ సిటిజెన్లకు వడ్డీ రేటు 7.75 శాతంగా ఉంది.రూ. 2 లక్షలు జమ చేస్తే అత్యధిక వడ్డీ రేటుపై ఎంత రాబడి వస్తుందో చూద్దాం. 31-60 నెలల టెన్యూర్‌పై సాధారణ ప్రజలకు వడ్డీ రేటు 7.40 శాతంగా ఉండగా.. 31 నెలల్లో రూ. 2 లక్షలపై రూ. 41,710 వడ్డీ వస్తుంది. ఇదే వడ్డీ రేటుపై 60 నెలల టెన్యూర్‌పై చూస్తే 2 లక్షలపై రూ. 88,570 వడ్డీ వస్తుంది. ఇదే సీనియర్ సిటిజెన్లకు 7.75 శాతం వడ్డీ రేటుతో చూస్తే 31 నెలల్లో రూ. 2 లక్షలపై రూ. 43,864 వడ్డీ వస్తుంది. 60 నెలలకు లేదా ఐదేళ్లకు రూ. 2 లక్షలపై వడ్డీ రూ. 93,569 వస్తుంది.