గురించి ఎంత చెప్పినా తక్కువే. వయస్సుకు మించిన ఆటతో ప్రపంచ క్రికెట్‌ను తన వైపునకు తిప్పుకునేలా చేస్తున్నాడు. సాదాసీదా బౌలర్లను కాదు ఏకంగా వరల్డ్ టాప్ క్లాస్ బౌలర్ల బౌలింగ్‌లో సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు. ఐపీఎల్ 2026 ముందు జరిగిన ఓ కార్యక్రమంలో . దాంతో ఇప్పుడు అందరి దృష్టి రాజస్థాన్ - ఢిల్లీ మ్యాచ్‌పై పడింది. ఐపీఎల్ 2026లో భాగంగా 43వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ - ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఇవాళ మ్యాచ్ జరగనుంది. జైపూర్‌లోని సవాయి మాన్‌సింగ్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ లైవ్‌ను స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ వేదికగా వీక్షించొచ్చు. ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి - మీదే ఉంది. చాలా కాలం తర్వాత క్రికెట్‌లో ఎంట్రీ ఇస్తున్న మిచెల్ స్టార్క్‌కు ఈ రోజు అగ్ని పరీక్షే. వికెట్లు పడగొడతాడా? లేదా? అన్న దానికంటే వైభవ్ చేతుల్లో మొదటి బంతికే సిక్స్ కొట్టించుకుంటాడా? లేదా? అన్నదే ఆసక్తికరంగా మారింది. బుమ్రా, బౌల్ట్, అర్ష్‌దీప్ ఇంకా మిగతా హేమాహేమీ బౌలర్లకు సైతం వైభవ్ చుక్కలు చూయించాడు. దాంతో వైభవ్ - స్టార్క్ కాంబినేషన్ ఇంట్రెస్టింగ్‌గా మారింది. గాయం కారణంగా ఈ సీజన్ తొలి 8 మ్యాచ్‌లకు దూరమైన మిచెల్ స్టార్క్ రాజస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఐపీఎల్ 2024లో కేకేఆర్ తరఫున ఆడిన స్టార్క్, కోల్‌కతా ఛాంపియన్‌గా నిలవడంలో ఫైనల్ మ్యాచ్‌లో కీలకంగా మారాడు. ఆ తర్వాత మెగా వేలంలో ఢిల్లీ దక్కించుకుంది. ఢిల్లీ తరఫున కూడా ఎన్నో మ్యాచ్‌లను గెలిపించాడు. ఈ సీజన్ ఆరంభంలో గాయం కారణంతో దూరంగా ఉంటూ వస్తున్న స్టార్క్ ఎట్టకేలకు ఎంట్రీ ఇవ్వనుండటంతో ఢిల్లీ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి రెండు మ్యాచ్‌లలో గెలిచి, ఆ తర్వాత ఓటముల పర్వం మొదలుపెట్టింది. మధ్యలో ఒక మ్యాచ్ గెలిచి మళ్లీ ఓడిపోయింది. ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ కేవలం మూడు మ్యాచ్‌లే గెలిచి, ఐదు ఓడింది. ప్లే ఆఫ్స్ బరిలో నిలవాలంటే ఢిల్లీకి ఈ మ్యాచ్ చాలా కీలకం. మిగతా ఆరు మ్యాచ్‌లలో కచ్చితంగా ఐదు గెలిస్తేనే ప్లే ఆఫ్స్ ఆశలు పెట్టుకోవచ్చు.