గత ఏడాది జూన్‌లో లండన్‌లో పోలో ఆడుతూ మరణించిన కీలక ఆదేశాలు వెలువరించింది. వ్యాపారవేత్త సంజయ్ కపూర్ ఆస్తులను పరిరక్షించాలని ఆదేశించింది. రెండో భార్య నటి కరిష్మా కపూర్‌ సంతానం పిల్లలు కియాన్, సమైరా కపూర్‌లకు.. ఆయన మూడో భార్య ప్రియా సచ్‌దేవా కపూర్‌కు మధ్య వివాదం నెలకున్న నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. సంజయ్ కపూర్ పేరు మీద ఉన్న వీలునామాను ప్రియా కపూర్ ఫోర్జరీ చేశారని, అలాగే ఆస్తుల పూర్తి జాబితాను వెల్లడించలేదని కియాన్, సమైరా ఆరోపించారు. ఆ జాబితాలో పోలో కోసం ఉపయోగించే ఖరీదైన గుర్రాలు, రోలెక్స్ వంటి బ్రాండ్‌లకు చెందిన చేతి గడియారాలు లేవని వారు పేర్కొన్నారు.కపూర్ కుటుంబ ఆస్తులలో భాగమైన సంజయ్ కపూర్‌కు చెందిన అనేక స్థిరాస్తులు, విలువైన పెయింటింగ్‌లు ప్రియా కపూర్ కోర్టుకు సమర్పించిన జాబితాలో చేర్చలేదని కూడా ఆ పిల్లలు పేర్కొన్నారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. సంజయ్ కపూర్ ఆస్తులను పరిరక్షించాలని, వాటిని దుర్వినియోగం చేయకూడదని ఆదేశించింది. అంతేకాదు, ప్రియా కపూర్ వాటిని అమ్మకుండా నిరోధిస్తూ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. బ్యాంకు ఖాతాల నిర్వహణను కూడా కోర్టు నిలిపివేసింది.అంతేకాదు, వీలునామాపై ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రియా కపూర్‌పై ఉందని కోర్టు స్పష్టం చేసింది. రెండో భార్య కరిష్మా కపూర్ పిల్లలు ఇప్పటికే కేసులో ప్రాథమిక ఆధారాలను అందించారని, ఒకవేళ ఎలాంటి చర్య తీసుకోకుండా ఉండి, ఆ తర్వాత వీలునామా నకిలీదని తేలితే అది 'అన్యాయం' అవుతుందని కోర్టు తెలిపింది. ఇక, ప్రియా కపూర్, సంజయ్ కపూర్ తల్లి రాణి కపూర్, సోదరి మందిరా కపూర్‌ల మధ్య కూడా ఆస్తి వివాదం ఉన్న సంగతి తెలిసిందే.ఇక, తెలిసిందే. ఆయన మరణానికి గుండెపోటు కారణమని తొలుత పేర్కొన్నప్పటికీ, అనాఫిలాక్టిక్ షాక్ తగిలినట్లు కూడా నివేదికలు వచ్చాయి. దీని వెనుక కుట్ర ఉందని తల్లి రాణి కపూర్ అనుమానం వ్యక్తం చేశారు. కానీ, గుండె జబ్బును కారణంగా చూపుతూ ఆయనది సహజ మరణమేనని బ్రిటిష్ వైద్య అధికారులు ధ్రువీకరించారు. అయితే, సంజయ్ మరణం తర్వాత ప్రియా సచదేవ్ కపూర్‌లో సోనా కామ్‌స్టార్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించడం వివాదాస్పదమైంది.