‘స్వచ్ఛ రథాలు’పై హీరో నాని స్పెషల్ వీడియో.. థ్యాంక్స్ చెప్పిన పవన్ కళ్యాణ్

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ లో 'స్వచ్ఛ రథాలు' అనే కార్యక్రమానికి డిప్యూటీ సీఎం శ్రీకారం చుట్టారనే సంగతి తెలిసిందే. గ్రామాల్లో చెత్త నుంచి సంపద సృష్టించాలనే ఆలోచనతో ఈ ప్రోగ్రాం ని తీసుకొచ్చారు. కార్యక్రమాన్ని లీవుడ్ హీరో నాని ఓ వీడియో చేశారు. ఈ సందర్భంగా స్వచ్ఛ రథాలపై ప్రజల్లో అవగాహన కోసం తన వంతు సాయం చేసిన నానికి పవన్ కళ్యాణ్ థ్యాంక్స్ చెప్పారు. స్వచ్ఛరథాలు గ్రామాల్లో విప్లవాత్మక మార్పు తెస్తున్నాయన్నారు. చెత్త నుంచి సంపద సృష్టి అనే యజ్ఞంలో ప్రజలను భాగస్వామ్యం చేశామని గుర్తుచేసుకున్నారు. ఈ మేరకు ‘ఎక్స్‌’లో పోస్ట్ పెట్టారు. ''మన పారిశుధ్యం.. మన ఆరోగ్యం.. మన బాధ్యత అన్న గౌరవ ఉపముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ ఆలోచనల నుంచి పురుడుపోసుకున్న స్వచ్ఛరథాలు గ్రామాల్లో విప్లవాత్మక మార్పు తెస్తున్నాయి. చెత్త నుంచి సంపద సృష్టి అనే యజ్ఞంలో గ్రామీణ ప్రజల్ని భాగస్వాముల్ని చేస్తూ దూసుకుపోతున్నాయి. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణను సులభతరం చేసేందుకు కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన స్వచ్ఛరథాల గురించి ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు అడిగిన వెంటనే తన వంతు సహాయ సహకారాలు అందించిన ప్రముఖ హీరో నాని గారికి పవన్ కళ్యాణ్ గారి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం''''ఈ స్వచ్చరథాలు ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో సుమారు 19 లక్షల కేజీల పొడి చెత్త కొనుగోలు చేయడం ద్వారా రూ. 3.32 కోట్ల విలువగల నిత్యవసరాలను ప్రజలకి అందించాయని చెప్పేందుకు ఆనందిస్తున్నాం. గ్రామాల్లో పారిశుధ్య ఉద్యమం పట్ల ప్రజల్లో పెంపొందుతున్న అవగాహనకు ఇది నిదర్శనం. భవిష్యత్ తరాలకు వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పించేందుకు ప్రతి గురువారం ఈ స్వచ్ఛరథాలు పాఠశాలల వద్దకు వెళ్లి పొడి చెత్తకు బదులుగా పుస్తకాలు మరియు స్టేషనరీ ఇచ్చే విధంగా చేసిన ఏర్పాటు కూడా సత్ఫలితాలను ఇస్తోంది. గౌరవ ప్రధాన మంత్రి , గౌరవ ముఖ్యమంత్రి 'స్వచ్ఛ భారత్' మరియు 'స్వచ్చఆంధ్ర' లక్ష్యాలను సాధించేందుకు ఈ స్వచ్ఛ రథం అనే కార్యక్రమాన్ని ప్రారంభించుట జరిగినది'' అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.''జనరల్ గా మన చుట్టూ చాలా చెడు ఉంది. ఆ చెడు గురించి మీడియాలో, సోషల్ మీడియాలో, ఫ్రెండ్స్ తో మాట్లాడుతుంటారు. దాని గురించి మనకి ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. చెడు కంటే మనం మంచి గురించి ఎక్కువగా మాట్లాడుకోగలగాలి. దాన్ని ఎక్కువగా సెలబ్రేట్ చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు 'స్వచ్ఛ రథాలు' అనే విన్నూత్న కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. అది చాలా ముఖ్యమని కార్యక్రమమని నేను భావిస్తున్నా'' అని నాని వీడియోలో తెలిపారు.