ఆఖరి 5 ఓవర్లలో 39 పరుగులే.. డెత్ ఓవర్లలో దడ పుట్టించిన సీఎస్కే బౌలర్లు

Wait 5 sec.

ఆరంభంలో బౌలింగ్ వీక్‌గా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పుడిప్పుడే ఓ దారిలో పడుతోంది. అయితే, ముంబై మీద గెలిచిన రెండు మ్యాచ్‌లలోనూ మ్యాజిక్ చేశారు. చెపాక్‌లో జరిగిన మ్యాచ్‌లో డెత్ ఓవర్లలో ముంబై బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. 15 ఓవర్లకు ముంబై ఇండియన్స్ స్కోర్ 120/4. క్రీజులో హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్ ఉన్నారు. దాంతో ముంబై ఇండియన్స్ ఈజీగా 170కి పైగా స్కోర్ చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ.. నమన్ ధీర్ అవుటవ్వడంతో ఒక్కసారిగా సీన్ మారింది. ఆఖరి నాలుగు ఓవర్లలో హార్దిక్ పాండ్యా అస్సలు ప్రభావం చూపలేకపోయాడు. నూర్ అహ్మద్ వేసిన 16వ ఓవర్‌లో ముంబై ఇండియన్స్ కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేసింది. 17వ ఓవర్‌లో 11 పరుగులు ఇచ్చినప్పటికీ నమన్ ధీర్ వికెట్ తీసుకున్నాడు. 18వ ఓవర్‌లో అన్షుల్ కాంబోజ్ కేవలం ఏడు పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. 19వ ఓవర్‌లో జెమీ ఓవర్టన్ నాలుగు పరుగులు మాత్రమే ఇవ్వడంతో ముంబై భారీ స్కోర్ చేయలేకపోయింది. ఆఖరి ఓవర్‌లో 13 పరుగులు వచ్చినప్పటికీ హార్దిక్ పాండ్యా అవుటవ్వడంతో 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. సీఎస్కే బౌలర్లలో అన్షుల్ కాంబోజ్ నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి 32 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసుకోగా, నూర్ అహ్మద్ నాలుగు ఓవర్లలో 26 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. ముకేశ్ చౌదరి మూడు ఓవర్లలో 25 పరుగులు ఇచ్చాడు. ఇక జెమీ ఓవర్టన్ నాలుగు ఓవర్లలో 23 పరుగులు పరుగులే మాత్రమే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టి కీలక బౌలర్‌గా మారాడు. యువ ఆటగాడు రామకృష్ణ ఘోష్ కూడా మూడు ఓవర్లలో 24 పరుగులు ఇచ్చి ఒక వికెట్ దక్కించుకోవడం విశేషం. ఈ సీజన్‌లో 9 మ్యాచ్‌లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నాలుగు విజయాలు సాధించింది. ఎనిమిది పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్న సీఎస్కేకి ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టాలంటే ఇంకో ఎనిమిది పాయింట్లు కచ్చితంగా కావాల్సిందే. సీఎస్కే తన మిగతా ఐదు మ్యాచ్‌లలో లక్నోతో రెండు.. ఢిల్లీ, సన్‌రైజర్స్, గుజరాత్ జట్లతో ఆడనుంది.