ITR దాఖలు కోసం.. ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో రిజిస్టర్ చేయాలా? చాలా సింపుల్.. ప్రాసెస్ ఇదే

Wait 5 sec.

Income Tax Returns: గత ఆర్థిక సంవత్సరం 2024-25కి సంబంధించిన ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నులు దాఖలు చేసేందుకు గడువు సమీపిస్తోంది. ఈ సారి ఐటీఆర్ గడువును సెప్టెంబర్ 15, 2025 వరకు ఇచ్చారు. ఈ డెడ్‌లైన్ సైతం సమీపిస్తోంది. ఇంకా దాదాపు 6 కోట్ల వరకు ఫైల్ చేయాల్సి ఉన్నట్లు గతేడాది గణాంకాలు చూస్తే తెలుస్తోంది. అయితే, ఈసారి తొలిసారి ఐటీఆర్ ఫైల్ చేసే వారు కొన్ని విషయాలు ముందుగానే తెలుసుకోవాలి. ముఖ్యంగా ఫస్ట్ టైమ్ ట్యాక్స్ పేయర్లు ఐటీఆర్ ఫైలింగ్ కోసం ముందుగా ఇన్‌కమ్ ట్యాక్స్ ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐటీఆర్ ఫైల్ చేయాలంటే ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకుని తమ ఐడీ క్రియేట్ చేసుకోవాలి. ఇ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా మాత్రమే ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడం, ఐటీఆర్ స్టేటస్ తనిఖీ, రీఫండ్ తనిఖీలు, ఐటీ విభాగం పంపించే నోటీసులను పరిశీలించడం, వాటికి సమాధానం ఇవ్వడం వంటివి చేయవచ్చు. అందుకు మనకంటూ ప్రత్యేక ఐడీ ఉండాలి. చాలా సింపుల్ ప్రాసెస్. ముందుగా అధికారిక ట్యాక్స్ పోర్టల్ incometax.gov.inలోకి వెళ్లాలి. హోమ్ పేజీలో కుడివైపు పైన కనిపించే రిజిస్టర్ బటన్ నొక్కాలి. యూజర్ టైప్ ఆప్షన్ పై క్లిక్ చేసి ట్యాక్స్ పేయర్ అని ఎంచుకోవాలి. ఆ తర్వాత కంటిన్యూపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ పాన్ కార్డు నంబర్ ఎంటర్ చేసి వాలిడేట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేసి కంటిన్యూపై నొక్కాలి. ఆ తర్వాత ఓపెన్ అయ్యే పేజీలో మీ పేరు, పుట్టిన తేదీ, జెండర్, చిరునామా వంటి పూర్తి వివరాలు ఇచ్చి కంటిన్యూ ప్రెస్ చేయాలి. ఆ తర్వాత వాలిడ్ మొబైల్ నంబర్, వాలిడ్ ఇ-మెయిల్ ఐడీ, పూర్తి అడ్రస్, రెసిడెన్షియల్ అడ్రస్ వంటివి ఇవ్వాలి. దీంతో మీ మొబైల్ నంబర్‌, ఇ-మెయిల్ ఐడీకి 6-డిజిట్ ఓటీపీలు రెండు వస్తాయి. వాటిని సూచించిన స్థానాల్లో ఎంటర్ చేయాలి. ఒకవేళ ఓటీపీలు రాకపోతే రీసెండ్ ఓటీపీపై క్లిక్ చేయాలి. మీరు ఎంటర్ చేసిన వివరాలను ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎవైనా తప్పులుంటే సరి చేసి కన్ఫామ్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత స్ట్రాంగ్ పాస్‌వర్డ్ క్రియేట్ చేయాలి. అదే పాస్‌వర్డ్ రీఎంటర్ చేసి కన్ఫామ్ చేయాలి. దీంతో మీ ప్రాసెస్ పూర్తవుతుంది. మీ ఐడీ, పాస్‌వర్డ్ భద్రంగా ఉంచుకోవాలి.