YS Viveka Murder Case: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై.. సంచలన వ్యాఖ్యలు చేశారు. మోహన్ రెడ్డి కోసమే.. వైఎస్ అవినాష్ రెడ్డిని కాపాడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా సీబీఐ దర్యాప్తుపైనా షర్మిల విమర్శలు గుప్పించారు. వివేకా హత్య కేసుపై ఎందుకు మళ్లీ దర్యాప్తు చేపట్టవద్దని ప్రశ్నించారు. ఇక తన సోదరుడు జగన్‌పైనా షర్మిల మండిపడ్డారు. ప్రధాని మోదీకి జగన్ దత్తపుత్రుడు అని ఆమె ఆరోపించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన షర్మిల.. వివేకా హత్య విషయంలో మళ్లీ దర్యాప్తు ఎందుకు చేపట్టవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వై నాట్ అంటూ నిలదీశారు.తన సోదరి, వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె వైఎస్ సునీత.. అప్పటి నుంచి ఇప్పటివరకు ఒకటే పోరాటం చేస్తున్నారని.. అయినప్పటికీ ఇంతవరకు న్యాయం జరగలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సునీత చేస్తున్న పోరాటంలో న్యాయం ఉందని షర్మిల తెలిపారు. వైఎస్ జగన్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దత్తపుత్రుడు అంటూ ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీబీఐ సంస్థ ప్రధాని మోదీ చేతిలో కీలు బొమ్మ అని.. వైఎస్ జగన్ కోసం.. మోదీ సీబీఐ గొంతును నొక్కేశారని ఆరోపించారు.చేశారు. నిజంగా సీబీఐ అధికారులు.. ఈ కేసులో న్యాయం గెలిపించాలి అని అనుకుంటే.. దోషులకు ఎప్పుడో శిక్ష పడేదని పేర్కొన్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో అన్ని ఆధారాలు లభించాయని.. గూగుల్ మ్యాప్ లొకేషన్లు కూడా ఉన్నట్లు తెలిపారు. వైఎస్ వివేకా హత్య జరిగిన సమయంలో.. సంఘటనా స్థలంలోనే అవినాష్ రెడ్డి ఉన్నాడని.. వాటికి సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయని షర్మిల సంచలన ఆరోపణలకు తెరతీశారు. అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ.. వైఎస్ వివేకా హత్య కేసులో ఇప్పటివరకు న్యాయం ఎందుకు జరగడం లేదని షర్మిల ప్రశ్నించారు. సీబీఐ అధికారులు చేసిన విచారణ సరిగా లేదంటూ వైఎస్ సునీత చేసిన ఆరోపణలు నిజమైనని పేర్కొన్నారు.