ప్రతి ఆదివారం ఏదో ఒక కొత్త థీమ్‌తో ఆడియన్స్‌ని నవ్విస్తూ ఉంటుంది స్టార్ మా పరివారం షో. ఇక ఈ వారం శ్రీముఖి Vs పాలేర్లు అనే థీమ్‌తో ఎంటర్‌టైన్ చేయబోతున్నారు. ఇక ఈ ఎపిసోడ్‌కి కోసం వచ్చింది. మౌలి, శివానీ నాగరం ఇద్దరూ పరివారంలో సందడి చేశారు. దీంతో మౌలితో కలిసి ముక్కు అవినాష్, ఎక్స్‌ప్రెస్ హరి సరదాగా ఓ స్కిట్ చేశారు.మౌలి మనందరి కోసం ఒక క్వార్టర్ తెచ్చాను.. అని అవినాష్ చెప్పాడు. అవును నువ్వేంటి ఫేస్ డల్‌గా పెట్టావని మౌలిని హరి అడగ్గా మందు అంటున్నారు కానీ ఓపెన్ చేయడం లేదేంటా అని అనుకుంటున్నాను అంటూ పంచ్ వేశాడు. ఇంతలో స్కిట్‌లో భాగంగా శ్రీముఖి హీరోయిన్ శివానీ తల్లిగా వాళ్ల దగ్గరికి వచ్చి ఏంటి మా అమ్మాయికి లైన్ వేస్తున్నారంట అంటూ అడిగింది. దమ్ముంటే నా ముందు ఐలవ్యూ చెప్పు అని శ్రీముఖి అనగానే మౌలి ఐలవ్యూ అంటూ చెప్పాడు. ఆంటీ కత్తిలా ఉందిదీనికి నువ్వు అమ్మకి చెప్పావా పిల్లకి చెప్పావా అని హరి అడిగితే ఇద్దరికీ అంటూ మరో పంచ్ వేశాడు మౌలి. అయినా నేను ఐలవ్యూ చెప్పాను ఓకే కానీ తను థాంక్యూ చెప్పిందే.. అంటూ మౌలి అడిగాడు. మావాడు ఏమైనా హ్యాపీ బర్త్‌డే చెప్పాడా థాంక్యూ చెప్పడానికి అంటూ అవినాష్ అడిగాడు. ఇంతలో మీరు మీ బ్యాచ్ అంతా రోజూ గొడవలవీ చేస్తున్నారని శ్రీముఖి అంటుంటే ఆంటీ కత్తిలా ఉంది అంటూ హరి అరిచాడు. దీంతో ఏం చెప్పాలో తెలీక శ్రీముఖి సైలెంట్ అయిపోయింది. ఇలా ప్రోమోలో శ్రీముఖిపై హరి చేసిన కామెంట్ హైలెట్ అయింది.ఇక శ్రీముఖి విషయానికొస్తే సినిమా ఈవెంట్లన్నీ సుమ కనకాల చక్కబెడుతుంటే టీవీ షోలన్నీ రాములమ్మే చూసుకుంటుంది. ముఖ్యంగా స్టార్ మాకి ఆస్థాన యాంకర్ అయిపోయింది శ్రీముఖి. ప్రస్తుతం చేస్తుంది. బిగ్‌బాస్ సీజన్-9కి కామనర్లని పంపించేందుకు జరుగుతున్న ప్రక్రియే అగ్నిపరీక్ష. ఇందులో కేవలం హోస్టుగా కాకుండా శ్రీముఖి కూడా కొన్ని నిర్ణయాలు తీసుకునే పవర్స్ ఇచ్చారు. అభిజిత్, బింధు మాధవి, నవదీప్‌తో కలిసి ఈ ఆడిషన్స్, సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటుంది శ్రీముఖి. దీంతో పాటు స్టార్ మా పరివారం, ఫెస్టివల్ ఈవెంట్లు కూడా చేస్తుంది శ్రీముఖి. ఇలా ప్రస్తుతం ఉన్న లేడీ యాంకర్లలో ఫుల్ బిజీగా ఉంది బుల్లితెర రాములమ్మ.