పెళ్లి ఆగిపోవడానికి కారణం చెప్పిన కీర్తి భట్.. డిస్టబెన్స్ వచ్చాయి.. అదంత ఈజీ కాదు.. దూల తీరిపోద్ది

Wait 5 sec.

కార్తీకదీపం, మనసిచ్చిచూడు వంటి సీరియల్స్‌తో పాపులర్ అయిన కన్నడ నటి కీర్తి భట్.. బిగ్ బాస్‌ షోతో క్రేజ్ దక్కించుకుంది. అయితే ఒక్కసారి బిగ్ బాస్‌లోకి వెళ్తే కెరియర్ ఖతమ్ అనే మాటని నిజం చేస్తూ.. బిగ్ బాస్ తరువాత కీర్తి భట్‌‌కి అవకాశాలు లేకుండా పోయాయి. ఎవరూ లేని అనాధ అయిన కీర్తి భట్.. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత 2023 ఆగష్టులో నిశ్చితార్ధం చేసుకుంది. నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ అయిన విజయ్ కార్తీక్‌తో నిశ్చితార్థం వేడుకగా జరిగింది. వీరి వివాహ నిశ్చితార్థానికి చాలామంది సెలబ్రిటీలు కదిలివెళ్లారు. యాక్సిడెంట్‌లో కీర్తిభట్‌ తన కుటుంబం మొత్తాన్ని కోల్పోవడమే కాకుండా.. ఆ ప్రమాదంలో అమ్మతనాన్ని కూడా కోల్పోయింది కీర్తి భట్. ఆమె గర్భసంచికి గట్టి దెబ్బ తగలడంతో.. ఆమె గర్భసంచిని తొలగించారు. దీంతో ఆమె జీవితంలో తల్లి అయ్యే అవకాశం లేదు. అది తెలిసినా కూడా విజయ్ కార్తీక్.. కీర్తిని ప్రేమించి మరీ ఆమెతో జీవితాన్ని పంచుకోవడానికి ముందొచ్చాడు. ఎవరూ లేని అనాథ అయిన తనతో జీవితాన్ని పంచుకుని తనకో కుటుంబాన్ని ఇచ్చిన విజయ్ గురించి పలు సందర్భంలో చాలా గొప్పగా చెప్పింది కీర్తి. అయితే వీరికి నిశ్చితార్థం 2023 ఆగస్టులో అయితే ఇది 2025 ఆగస్టు. అంటే నిశ్చితార్థం అయ్యి దాదాపు మూడేళ్లు అవుతున్నా.. వీరు ఇంకా సహజీవనంలోనే ఉన్నారు కానీ.. ఇంకా పెళ్లి చేసుకోకపోవడంతో కీర్తి ఎక్కడ కనిపించినా వీరి పెళ్లి గురించే అడుగుతున్నారు. అయితే వీళ్ల నిశ్చితార్థం కూడా క్యాన్సిల్ చేసుకున్నారు.. పెళ్లి కావడం కూడా కష్టమేనని వార్తలు రావడంతో.. వాటిపై స్పందించారు కీర్తి భట్. కొన్ని కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల మా పెళ్లి ఆగింది.. మాకు ఇల్లు తీసుకోవాలని మొదటి నుంచీ ఉంది. పెళ్లైన తరువాత మొదటి అడుగు ఈ ఇంట్లోనే పెట్టాలని ఉండేది. దానివల్ల పెళ్లి ఆగింది. పెళ్లి అనేది అంత ఈజీ కాదు.. చాలా కారణాలు ఉంటాయి. ఎంగేజ్‌మెంట్‌ చేసుకోవడానికే మాకు దూల తీరిపోయింది. ఇంక పెళ్లి అంటే.. కొంచెం టైమ్ పడుతుంది. బట్ ఈ ఏడాదే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం. అందరి ఆశీర్వాదం ఉంటే.. మా పెళ్లి అవుతుంది. ఇదొక్కటే కాదు.. మా మామయ్య వాళ్ల బ్రదర్ అంటే కార్తీక్ వాళ్ల చిన్నాన్న చనిపోయారు. దాని వల్ల మా పెళ్లి ఆగింది. కొన్ని కొన్ని ఉంటాయి కదా.. అవన్నీ పూర్తవ్వాలి. ఎంగేజ్‌మెంట్ మేమేం కంగారు పడిపడి చేసుకోలేదు. ఇంట్లో వాళ్లంతా ఓకే అన్నారు. కార్తీక్ వాళ్ల అమ్మానాన్నా కూడా ఎంగేజ్‌మెంట్ కావాలన్నారు. ఆ డేట్ చాలా బాగుంది.. అందుకే ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాం. కానీ పెళ్లి కాలేదంటే కొన్ని డిస్టబెన్స్ వస్తుంటాయి. టైమ్ కూడి వస్తే పెళ్లి అవుతుంది. మేం కలిసి ఫొటోలు పెట్టినా.. పెట్టకపోయినా ఏమైంది? పెళ్లి ఎప్పుడు? అని అడుగుతున్నారు. కలిసి తిరిగినా అడుగుతున్నారు.. కలిసి తిరక్కపోయినా పెళ్లి ఎప్పుడు అని అడుగుతున్నారు. మేం కలిసే ఉన్నాం.. కలిసే ఫొటోలు పెడుతున్నా.. వాళ్ల ఇంటికి వెళ్లినప్పుడు కూడా ఇద్దరం కలిసి ఉన్న ఫొటోలు పెట్టాను. చూడని వాళ్లు ఏదో మాట్లాడుతుంటారు. నా లైఫ్ బిగ్ బాస్ ముందు చాలా స్ట్రగుల్స్ చూశాను.. వెళ్లొచ్చిన తరువాతా చూశాను. ఆ రెండూ డిఫరెంట్. మనుషులు వారి మనస్తత్వాలు తెలిసింది.. నమ్మకం, ప్రేమా అన్నీ తెలుసుకున్నా. బిగ్ బాస్ తరువాత ఏదో మారిపోతుంది.. ఆఫర్లు వస్తాయి అని అంటుంటారు కానీ.. వాస్తవంలో అదంతా అబద్దం.. నాకేం ఆఫర్లు లేవు. కాబట్టి... బయటివాళ్లని ఫేస్ చేయడానికి భయంగా ఉంటుంది. నేను బిగ్ బాస్‌కి వెళ్ళేముందు.. నాకు చాలా సర్కిల్ ఉంది. నా వాళ్లు అనుకునే వాళ్లు నా చుట్టూనే ఉన్నారు. కానీ ఎప్పుడైతే బిగ్ బాస్‌కి వెళ్లానో.. వాళ్లంతా దూరం అయిపోయారు. నేను హౌస్‌లో ఉన్నప్పుడు కూడా సపోర్ట్ చేయలేదు. నేను వాళ్ల పక్కనున్నంతవరకే నేనూ.. ఒక్కసారి లేకపోతే పట్టించుకోరని అర్థం అయ్యింది. నమ్మకం విషయంలో నాకు బాగా తెలిసొచ్చింది. ఎవర్ని నమ్మాలీ.. ఎవర్ని నమ్మకూడదని. నేనైతే మనుషుల్ని ఈజీగా నమ్మేస్తాను. అంతా నా వాళ్లే అని నా పర్సనల్ విషయాలన్నీ షేర్ చేసుకుంటాను. వాళ్లు మాత్రం నన్ను ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచుతారని నాకు ఇప్పుడిప్పుడే అర్థం అయ్యింది’ అని చెప్పుకొచ్చింది కీర్తి భట్.