: ప్రభుత్వ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) తమ వినియోగదారులకు చాలా చౌకైన ప్లాన్లు అందిస్తోంది. బడ్జెట్ ధరలో టెలికాం సేవలు అందిస్తోన్న సంస్థగా బీఎస్ఎన్ఎల్ పేరు సూచించవచ్చు. ప్రైవేట్ టెలికాం కంపెనీలైన ప్రత్యర్థి సంస్థలు జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు కొద్ది కాలం క్రితం రీఛార్జ్ ప్లాన్ల ధరలు పెంచితే బీఎస్ఎన్ఎల్ మాత్రం చౌక ప్లాన్ అందిస్తూ యూజర్లను ఆకర్షిస్తోంది. అయితే 5జీ యూజర్ల విషయానికి వస్తే జియో, ఎయిర్ టెల్‌కే జై కోడుతుండడం గమనార్హం. ప్రస్తుత రోజుల్లో ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరిగింది. సోషల్ మీడియాలో క్షణ కాలం లేకపోతే ఏదో జరిగిపోతుందనే స్థాయికి వచ్చేశాం. దీంతో ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న ప్లాన్లకే మొబైల్ యూజర్లు మొగ్గు చూపుతున్నారు. రోజు వారీ డేటా అయిపోతే ఇబ్బందులు పడకుండా అదనపు డేటా ప్లాన్లతో రీఛార్జ్ చేసుకుంటారు. ఈ డేటా ప్లాన్లలోనూ బీఎస్ఎన్ఎల్ చౌక అని చెప్పవచ్చు. జియోలో ప్రస్తుతం రూ. 289 డేటా ప్లాన్ బీఎస్ఎన్ఎల్‌లో కేవలం రూ. 151కే లభిస్తోంది. అంటే దాదాపు 50 శాతం డిస్కౌంట్ రేటుతో అవే బెనిఫిట్స్ కల్పిస్తోంది.బీఎస్ఎన్ఎల్ రూ. 151 ప్లాన్ వివరాలుఈ ప్లాన్ కొనుగోలు చేస్తే 40 జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. 28 రోజుల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. దీని ద్వారా జింగ్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. అయితే, ఇది డేటా ఓన్లీ ప్లాన్ కావడంతో దీని ద్వారా కాల్స్, ఎస్ఎంఎస్‌లు లభించవు. జియోలో అయితే రూ. 289తో రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది. 40 జీబీ డేటా 30 రోజుల వ్యాలిడిటీతో వస్తోంది. తక్కువ వ్యవధిలో ఎక్కువ డేటా కావాల్సిన వారు, కాలింగ్, ఎస్ఎంఎస్‌ సేవలు అవసరం లేని వారు ఈ ప్లాన్ ఎంచుకోవచ్చు. రూ. 151కే 28 రోజుల వ్యాలిడిటీతో 40 జీబీ ఇస్తోంది బీఎస్ఎన్ఎల్. అలాగే బీఎస్ఎన్ఎల్ రూ. 198 సైతం తెచ్చింది. ఈ ప్లాన్ 40 రోజుల పాటు ఉంటుంది. ఇందులో 80జీబీ డేటా ఉంటుంది. రోజుకు 2జీబీ చొప్పున లభిస్తుంది. రోజు వారీ డేటా లిమిట్ అయిపోతే ఇంటర్నెట్ స్పీడ్ 40 కేబీపీఎస్ వస్తుంది. అయితే, ఎస్ఎంఎస్‌లు, కాల్స్ ఉండవు.