: స్మాల్ క్యాప్ కేటగిరిలోని వ్యవసాయ రంగ సెక్టార్ సంస్థ అప్ సర్జ్ సీడ్స్ ఆఫ్ అగ్రికల్చర్ లిమిటెడ్ () తమ వాటాదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇటీవలే జరిగిన కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో షేర్ హోల్డర్లకు జారీకి చేసేందుకు ఆమోదం లభించింది. ఈ బోనస్ ఇష్యూ ప్రకారం ప్రతి 7 షేర్లకు బోనస్‌గా 3 షేర్లు ఇస్తారు. ఈ బోనస్ షేర్ల రికార్డు తేదీ ఇంకా నిర్ణయించలేదు. మరోవైపు ఈ స్టాక్ గత నెల రోజుల్లో 77 శాతం మేర లాభాన్ని అందించింది.కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం.. అంటే రికార్డు తేదీ నాటికి రూ. 10 ఫేస్ వ్యాల్యూ ఉన్న 7 ఈక్విటీ షేర్లను తమ డీమ్యాట్ ఖాతాలో కలిగి ఉన్న వారికి అదనంగా రూ. 10 ఫేస్ వ్యాల్యూ ఉండే 3 ఈక్విటీ షేర్లను బోనస్ రూపంలో ఉచితంగా అందిస్తారు. ఇందుకు కంపెనీ డైరెక్టర్స్ బోర్డు ఆమోదం తెలిపింది. ఈ బోనస్ షేర్లకు అర్హులైన వారికిని గుర్తించేందుకు రికార్డు తేదీని త్వరలోనే ప్రకటిస్తామని కంపెనీ తెలిపింది.క్రితం రోజు ట్రేడింగ్ సెషన్‌లో అప్ సర్జ్ సీడ్స్ అఫ్ అగ్రికల్చర్ షేరు 5 శాతం నష్టపోయింది. మార్కెట్ ముగిసే నాటికి రూ. 278 వద్ద స్థిరపడింది. ఇవాళ్టి మార్కెట్ ట్రేడింగ్‌లోనూ ఈ స్టాక్ 5 శాతం మేర పడిపోయింది. ఈ వార్త రాసే సమయానికి రూ.264 వద్ద ట్రేడవుతోంది. ఇక ఈ షేరు 52 వారాల గరిష్ఠ ధర రూ. 314.40, కనిష్ఠ ధర రూ. 130.70 లుగా ఉన్నాయి. గత వారం రోజుల్లో ఈ స్టాక్ 10 శాతానికి పైగా నష్టపోయింది. గత ఏడాది కాలంలో 6 శాతం నష్టపోయింది. చివరగా గత ఐదేళ్లల్లో 99 శాతం లాభాన్ని ఇచ్చింది. అంటే లక్ష రూపాయలు పెట్టిన వారికి మరో లక్ష రూపాయలు అందించింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 186 కోట్లుగా ఉంది. ఈ కథనం సమాచారం అందించేందుకే. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు హైరిస్క్ కలిగి ఉంటాయి. సరైన స్టాక్ ఎంచుకోలేకపోతే నష్టపోయే ప్రమాదం ఉంటుంది. నిపుణుల సలహాలు తీసుకుని ఇన్వెస్ట్ చేయడం మంచిది.