iPhone 17 Series: యాపిల్ ఐఫోన్ కొత్త ఫోన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి ఈసారి ధరల షాక్ తగలనుంది. వచ్చే నెల సెప్టెంబర్ 8, 2025వ తేదీ రోజున లాంచ్ అవుతున్నాయి. అయితే, ఈసారి ఊహించిన దానికంటే ధర అధికంగా ఉండనుందని తెలుస్తోంది. ఈ సిరీస్‌లో మొత్తం నాలుగు మోడల్స్ ఉన్నట్లు సమాచారం. అందులో ఐఫోనే 27, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ అనే నాలుగు మోడళ్లను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, గతంతో పోలిస్తే ఈసారి మార్కెట్లోకి విడుదలయ్యే ఐఫోన్ 17ల మోడళ్లలో భారీ అప్‌గ్రేడ్స్ ఉంటాయని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. ఈ కారణంగానే ఐఫోన్ల ధరలు పెరుగుదలకు అవకాశం ఉందంటున్నారు. దాపు 50 డాలర్ల వరకు పెంపు ఉన్నట్లు దీని ద్వారా తెలుస్తోంది. ఈ సిరీస్‌లో దేశీయ మార్కెట్లో లాంచ్ అవుతోన్న ఫోన్లు మరింత ఖరీదు అవుతాయని తెలుస్తోంది. లీకైన ఫోన్ల వివరాలను బట్టి చూసుకుంటే ఐఫోనే 17 సిరీస్ ధరలు ఎంత మేర పెరగవచ్చనే అంచనాలు ఉన్నాయి. ఐఫోన్ 17 128 జీబీ వేరియంట్ ధర 849 డాలర్లు ఉంటే సుమారు రూ. 84,990 వరకు ఉండవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఐఫోన్ 16ప్రో ధర 999 డాలర్లుగా ఉండగా ఈసారి ఐపోన్ 17 ప్రో ధర 1049 డాలర్లుగా ఉండనుందని (రూ. 1,24,990) తెలుస్తోంది. ఇక ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ధర 1249 డాలర్ల వరకు అంటే రూ. 1,50,000 కు పెరగవచ్చని సమాచారం. ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ ఈవెంట్ వచ్చే నెల సెప్టెంబర్ 9న రాత్రి 10.30 గంటలకు జరగనుంది. దీనిని యాపిల్ టీవీ, యాపిల్ .కామ్ లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ధరల పెంపుపై అప్పుడే ఓ క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఐఫోన్ 17 ప్రో 5 కలర్ ఆప్షన్లలో రాబోవచ్చని సమాచారం. నలుపు, తెలుపు, ముదురు నీలం, బూడిద, నారింజ రంగుల్లో ఉంటుందని తెలుస్తోంది. కొత్త కలర్ ఆప్షన్లు వైవిధ్యంగా, వ్యక్తిగతతను సూచిస్తాయి. ఈ కొత్త వేరియంట్లు ట్రెండీ, ఆధునిక ఫీచర్లతో ఆకర్షణీయంగా నిలుస్తాయని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.