అదిరే ఫీచర్లతో టీవీఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 158 కిలోమీటర్ల ప్రయాణం.. ధర తక్కువే!

Wait 5 sec.

: టీవీఎస్ మోటార్.. ఎలక్ట్రిక్ విభాగంలో తన పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తూ వెళ్తోంది. తాజాగా కొత్త విద్యుత్ మోటార్‌ను ఆవిష్కరించింది. ఇదే టీవీఎస్ ఆర్బిటర్. ఇది ఎంట్రీ లెవెల్ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అని పేర్కొంది. ఇప్పటికే దీనికి సంబంధించి బుకింగ్స్ ఓపెన్ అయినట్లు.. మార్కెట్లోకి విడుదల చేసినట్లు తెలిపింది. ఇప్పటివరకు తన ఎంట్రీ లెవెల్ మోడల్‌గా ఐక్యూబ్ ఉండగా.. ఇప్పుడు ఎంట్రీ లెవెల్ మోడల్‌గా ఉండనుంది. ఇక దీని ధర రూ. 99,900 గా పేర్కొంది. ఇది ఎక్స్ షోరూమ్ ధర అని చెప్పొచ్చు. ఆన్ రోడ్ ప్రైస్ ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. టీవీఎస్ ఆర్బిటర్ మొత్తం రెండు కలర్లలో, 6 వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. ఇవి నియాన్ సన్‌బర్ట్స్, స్ట్రాటోస్ బ్లూ, లూనార్ గ్రే, స్టెల్లార్ సిల్వర్, కాస్మిక్ టైటానియం, మార్టియన్ కాపర్. భారత్‌తో పాటు అంతర్జాతీయంగా తమ మార్కెట్‌ను మరింత విస్తరిస్తూ.. బలోపేతం అయ్యే దిశగా ప్రణాళికలు రచిస్తున్నట్లు టీవీఎస్ మోటార్ ఒక ప్రకటనలో తెలిపింది. పట్టణ వినియోగదారులే లక్ష్యంగా ఈ ఆర్బిటర్‌ను తీసుకొచ్చినట్లు.. ఇండియా 2w బిజినెస్ టీవీఎస్ మోటార్ కంపెనీ ప్రెసిడెంట్ గౌరవ్ గుప్తా వెల్లడించారు.ఫీచర్లు, రేంజ్ విషయాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ స్కూటర్ 3.1 kWh బ్యాటరీతో.. సింగిల్ ఛార్జ్‌తో ఏకంగా 158 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఐక్యూబ్‌ మాత్రం మల్టిపుల్ బ్యాటరీ ఆప్షన్లతో వచ్చిన సంగతి తెలిసిందే. సింపుల్, ఫ్లాట్, కమ్యూటర్ స్టైల్ బాడీతో వస్తుంది. లాంగ్, ఫ్లాట్ సీట్ ఇస్తోంది. 34 లీటర్ అండర్ సీట్ స్టోరేజ్ అందుబాటులో ఉంటుంది. ఇక్కడ యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్ సహా రెండు హెల్మెట్లు కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా 14 అంగుళాల ఫ్రంట్ వీల్ ఉంది.టీవీఎస్ SmartXonnect యాప్ ద్వారా.. జియో ఫెన్సింగ్, సేఫ్టీ అలర్ట్స్, కాల్ అలర్ట్స్, నావిగేషన్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. వీటితో సహా క్రూయిజ్ కంట్రోల్ మోడ్, ఆటోమేటెడ్ హిల్ హోల్డ్, రివర్స్ మోడ్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ఈ టీవీఎస్ ఎలక్ట్రిక్ మోడల్.. ఆథర్ రిజ్టా, ఓలా ఎస్1ఎక్స్, హీరో విడా వీఎక్స్2 వంటి ఇతర మోడళ్ల నుంచి గట్టి పోటీ ఎదుర్కోనుంది.