అశ్లీల వెబ్‌సైట్‌లో ఇటలీ ప్రధాని మెలోనీ ఫోటోలు.. 7 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు

Wait 5 sec.

ఫోటోలను.. కొందరు దుండగులు.. ఏకంగా పోర్న్ వెబ్‌సైట్‌లో పెట్టడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. జార్జియా మెలోనితోపాటు.. చాలా మంది ఇతర ప్రముఖుల ఫోటోలను అదే వెబ్‌సైట్‌లో మార్ఫింగ్ చేసి పెట్టారు. ఫికా అనే పోర్నోగ్రఫీ ప్లాట్‌ఫామ్‌లో ప్రధాని మెలోనితోపాటు.. పలువురు ఫోటోలు ఉన్నట్లు వెల్లడైంది. మెలోనితోపాటు.. ఆమె సోదరి అరియానా, ఇటలీ ప్రతిపక్ష నాయకురాలు ఎల్లీ స్క్లెయిన్, ఇన్‌ఫ్లూయెన్సర్ చియారా ఫెర్రాగ్ని, యూరోపియన్ యూనియన్ చట్టసభ సభ్యురాలు అలెశాండ్రా మోరెట్టి సహా చాలా మంది పేరుగాంచిన మహిళల ఫోటోలను కూడా ఫికా పోర్న్ వెబ్‌సైట్‌లో పెట్టడం సంచలనం రేపుతోంది. ఈ వ్యవహారంపై ఇటలీ ప్రధాని స్పందించారు. పోర్న్‌సైట్‌లో తనతోపాటు చాలా మంది మహిళల ఫోటోలను మార్ఫింగ్ చేసి పోస్ట్ చేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన జార్జియా మెలోని.. ఈ చర్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. ఇక ఈ ఫికా ప్లాట్‌ఫామ్‌కు 7 లక్షల మంది సబ్‍స్క్రైబర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వెబ్‌సైట్‌లో చాలా మంది మహిళల ఫోటోలను మార్ఫింగ్ చేసి అప్‌లోడ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. మహిళల శరీర భాగాలను జూమ్ చేసి.. అశ్లీలంగా ఉండేలా మార్ఫింగ్ చేశారు. అంతేకాకుండా ఆ ఫోటోల కింద అసభ్యకరమైన, స్త్రీద్వేషపూరిత వ్యాఖ్యలను రాసి ఉంచారు. ఇక ప్రముఖుల ఫోటోలను ఫికా వెబ్‌సైట్‌లో ఏకంగా 'వీఐపీ సెక్షన్' ఏర్పాటు చేసి పెట్టారు.ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని.. జార్జియా మెలోని తెలిపారు. ఇది మహిళలను అవమానించడమేనని పేర్కొన్నారు. ఈ వెబ్‌సైట్‌లో పెట్టిన మార్ఫింగ్ ఫోటోల బాధిత మహిళలందరికీ తాను సంఘీభావం తెలుపుతున్నట్లు అని చెప్పారు. ప్రస్తుతం మనం 2025లో జీవిస్తున్నామని.. ఇప్పటికి కూడా ఒక మహిళ గౌరవాన్ని కించపరచడం సాధారణ విషయంగా భావించే వారు ఉన్నారంటే అది చాలా బాధాకరమని మెలోని పేర్కొన్నారు.ఇక మహిళల ఫోటోలను మార్ఫింగ్ చేసి.. పోర్న్ సైట్లలో అప్‌లోడ్ చేసిన ఘటనకు సంబంధించి.. వామపక్ష డెమోక్రటిక్ పార్టీకి చెందిన నేతలు పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ వ్యవహారంపై విచారణ చేపట్టారు. డెమోక్రటిక్ పార్టీ నాయకురాలు అయిన వలేరియా కాంపాగ్నా అనే మహిళ.. తన ఫోటోలు కూడా మార్ఫింగ్‌ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది తన ఒక్కదానికి సంబంధించింది కాదని.. మహిళలందరి హక్కులకు సంబంధించిందని తెలిపారు. మరోవైపు.. ఈ వ్యవహారం బయటికి వచ్చిన తర్వాత ఫేస్‌బుక్‌లో ఉన్న ఒక పేజీని మెటా సంస్థ క్లోజ్ చేసింది. 'మియా మొగ్లియే' (ఇటలీలో 'నా భార్య' అని అర్థం) పేరుతో ఉన్న ఇటాలియన్ ఫేస్‌బుక్ ఖాతాను మెటా మూసివేసింది. ఆ గ్రూపులో పురుషులు.. తమ భార్యలకు సంబంధించిన, తెలియని మహిళలకు సంబంధించిన సన్నిహిత, అశ్లీల ఫోటోలను షేర్ చేస్తున్నట్లు గుర్తించారు. ఇక ఆ గ్రూపులో 32 వేల మంది ఫాలోవర్లు ఉన్నట్లు తెలుస్తోంది.