అమెరికా అధ్యక్షుడు అనారోగ్యానికి గురయ్యారా.. ఇటీవల ట్రంప్ బహిరంగంగా కనిపించకపోవడం, అధికారిక షెడ్యూల్‌లో ఎలాంటి ఈవెంట్లు లేకపోవడంతో ట్రంప్ ఎక్కడున్నారనే వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. ఇటీవల మీడియా ముందుకు రాని ట్రంప్.. మరో రెండు రోజుల పాటు ఎలాంటి మీటింగ్స్ షెడ్యూల్‌ చేసుకోలేదని వైట్‌హౌస్ వర్గాల ద్వారా తెలుస్తోంది. దీంతో ట్రంప్ మిస్సింగ్ అంటూ వార్తలు వెలువడుతున్నాయి. అదే సమయంలో ట్రంప్ తన ప్రకటనలను నేరుగా కాకుండా సోషల్ మీడియాలో పేర్కొంటుండటం కూడా అనుమానాలకు మరింత బలాన్నిస్తోంది. అయితే ట్రంప్ సన్నిహితులు మాత్రం.. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారంటూ చెబుతున్నారు. 79 ఏళ్ల డొనాల్డ్‌ ట్రంప్‌ ఆరోగ్యంపై ఇటీవల చాలా రూమర్లు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఆయన బాహ్య ప్రపంచానికి కనిపించకపోవడంతో.. ట్రంప్ మిస్సింగ్‌ అంటూ ప్రచారం జరుగుతోంది. గతకొన్ని రోజులుగా మీడియా ముందుకురాని ట్రంప్‌.. ఏదైనా చెప్పాలనుకుంటే మాత్రం తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్‌ సోషల్ ద్వారానే వెల్లడిస్తున్నారు. ఇక ఆగస్ట్ 30, 31వ తేదీల్లోనూ.. ట్రంప్‌కు సంబంధించి ఎలాంటి పబ్లిక్‌ ఈవెంట్లు లేవని వైట్‌హౌస్‌ షెడ్యూల్‌ ద్వారా తెలుస్తోంది. దీంతో ట్రంప్ ఆరోగ్యంపై తీవ్ర అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఇక ట్రంప్‌ అనారోగ్యం బారిన పడ్డారని వార్తలు వస్తున్న వేళ.. ఇటీవల ఆయన చేతిపై గాయాలు కనిపించడం.. సోషల్‌ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ క్రమంలోనే ఒక వ్యక్తి ఎక్స్‌లో చేసిన ఓ పోస్ట్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత 24 గంటలుగా ట్రంప్‌ బయటికి కనిపించలేదు.. మరో 2 రోజులు కూడా ఆయన ఎలాంటి పబ్లిక్‌ మీటింగ్‌లకు హాజరయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. అసలు ఏం జరుగుతోందంటూ ఆ వ్యక్తి తన పోస్ట్‌లో వెల్లడించాడు. అయితే ట్రంప్ ఆరోగ్యంపై వస్తున్న వార్తలన్నీ పుకార్లేనని.. ఆయన ఫిట్‌గా ఉన్నారని.. అందుకు ట్రంప్ చేసిన ట్రూత్‌ సోషల్‌ పోస్ట్‌లు చెబుతున్నాయని మరికొందరు చెబుతున్నారు. సెప్టెంబర్‌ 1వ తేదీన కార్మిక దినోత్సవం సందర్భంగా ఆయన.. ఈనెల 30, 31వ తేదీల్లో ఎలాంటి ఈవెంట్లకు హాజరుకావడం లేదని.. అదే కారణమని పేర్కొంటున్నారు. మరోవైపు.. ట్రంప్‌ అనారోగ్యంపై పదే పదే వార్తలు వస్తున్నాయి. ఇటీవల చేతిపై గాయంతో ట్రంప్‌ కనిపించడం.. గతంలో ఆ గాయాన్ని దాచేందుకు చేతికి మేకప్‌ వేసుకొని కనిపించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై ట్రంప్‌ పర్సనల్ డాక్టర్ సీన్‌ బార్బబెల్లా ఒక క్లారిటీ ఇచ్చారు. ట్రంప్‌కు గాయం అయింది నిజమేనని వెల్లడించారు. ఆయన తరచూ షేక్ హ్యాండ్స్ ఇవ్వడం, ఆస్ప్రిన్‌ వాడటం వల్ల ఆ గాయం ఏర్పడినట్లు తెలిపారు. అయితే.. ట్రంప్‌ సంపూర్ణ ఆరోగ్యంతోనే ఉన్నారని.. సీన్ బార్బబెల్లా తేల్చి చెప్పారు.