రాజస్థాన్ రాయల్స్‌కి బిగ్ షాక్.. ఫ్రాంఛైజీకి రాహుల్ ద్రవిడ్ గుడ్ బై!

Wait 5 sec.

2026కి ముందు రాజస్థాన్ రాయల్స్‌కి బిగ్ షాక్ తగిలింది. ఇండియన్ వాల్ ది గ్రేట్ రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ హెడ్ కోచ్ పదవికి గుడ్ బై చెప్పాడు. ఈ విషయాన్ని నేరుగా రాజస్థాన్ రాయల్సే ఒక ప్రకటన ద్వారా ధృవీకరించింది. “ఫ్రాంఛైజీ నిర్మాణ పునర్విమర్శలో భాగంగా ద్రావిడ్‌కు విస్తృత స్థాయి పదవి ఆఫర్ చేసినా, ఆయన ఆ అవకాశాన్ని స్వీకరించలేదు” అని రాయల్స్ పేర్కొంది.“రాయల్స్ ప్రయాణంలో రాహుల్ కీలక భాగస్వామి. ఆయన నాయకత్వం అనేకమంది ఆటగాళ్లను ప్రభావితం చేసింది. జట్టులో బలమైన విలువలు నాటారు. ఫ్రాంఛైజీ సంస్కృతిపై ఆయన ముద్ర ఎప్పటికీ చెరగని విధంగా ఉంటుంది. రాయల్స్ ఆటగాళ్లు, అభిమానులు ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు” అని ఫ్రాంఛైజీ ఒక ప్రకటనలో పేర్కొంది.ఐపీఎల్ 2025లో రాయల్స్ ప్రదర్శన అత్యంత నిరాశ కలిగించింది. 10 మ్యాచ్‌లలో కేవలం నాలుగు విజయాలు మాత్రమే సాధించగలిగింది. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకుంది. ఐదు సార్లు ట్రోఫీ గెలుచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ కంటే ఒక్క మెట్టు మాత్రమే పైగా ముగించింది. కెప్టెన్ సంజు శాంసన్ గాయంతో కొన్ని మ్యాచ్‌లు మిస్ కావడం, ఆ సమయంలో రియాన్ పరాగ్ జట్టును నడిపించడం కూడా ఫలితాలపై ప్రభావం చూపింది.ద్రావిడ్ కోచ్ పదవి నుంచి వైదొలిగిన సందర్భంగా సంజు శాంసన్ భవిష్యత్తుపై కొత్త చర్చలకు దారితీసింది. ఇప్పటికే ఆయన ఫ్రాంఛైజీని వదిలి వెళ్లాలని అనుకుంటున్నారని బలమైన వార్తలు వినిపిస్తున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ శాంసన్‌పై కన్నేసిన విషయం తెలిసిందే. ద్రవిడ్ వెళ్లిపోవడంతో శాంసన్ నిర్ణయం ఏవిధంగా మారుతుందనేది ఆసక్తికరంగా మారింది.రాహుల్ ద్రావిడ్‌ మొదటిసారిగా ఐపీఎల్ 2011 మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ జట్టులో చేరారు. ఆటగాడిగా మూడు సీజన్లు ఆర్ఆర్‌తో కొనసాగి, 2013లో రిటైర్డ్ అయ్యాడు. ఆ తర్వాత కోచ్‌గా 2014, 2015లో ఫ్రాంఛైజీకి సేవలందించారు.2015 నుంచి 2024 వరకు బీసీసీఐలో కొనసాగడం వల్ల ఐపీఎల్‌లో పని చేయలేకపోయారు. 2023లో భారత జట్టుతో ఒప్పందాన్ని పొడిగించుకున్న ద్రవిడ్, 2024 టీ20 ప్రపంచకప్ గెలుపుతో కోచ్‌గా తన జాతీయ జట్టు ప్రయాణాన్ని ఘనంగా ముగించారు. మళ్లీ పదేళ్లకు తిరిగి రాజస్థాన్ రాయల్స్ ప్రధాన కోచ్‌గా చేరినా, ఆ రీ యూనియన్ ఒక్క సీజన్‌నే కొనసాగింది. ఐపీఎల్ 2026కు ముందు ఆయన మరో ఫ్రాంఛైజీలో చేరే అవకాశాలు ఉన్నాయని క్రికెట్ వర్గాలు అంటున్నాయి.