నగరంలో ట్రాఫిక్ సమస్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సాధారణ రోజుల్లోనే భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. ఇక చిన్న వాన పడితే చాలు.. నగరం స్థంభించిపోతుంది. గంటల తరబడి రోడ్ల మీద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొని ఉంటుంది. దీంతో రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే.. అభివృద్ధి మీద ప్రత్యేకంగా దృష్టి సారిస్తాయి. ముఖ్యంగా నగరంలో రహాదారుల విస్తరణ, . ఈక్రమంలో హైదరాబాద్ వాసులకు మరో శుభవార్త చెప్పింది. నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఆ వివరాలు..రేతిబౌలి, నానల్ నగర్ జంక్షన్ల మీదుగా ఈ భారీ మల్టీలెవల్ ఫ్లైఓవర్‌ని నిర్మించనున్నారు. ఈమార్గం ద్వారా నిత్యం వేలాదిమంది ముంబై, కర్ణాటకలోని పలు ప్రాంతాలతో పాటుగా రాష్ట్రంలోని వికారాబాద్, చేవేళ్ల, శంకర్‌పల్లి, గచ్చిబౌలి వైపు ప్రయాణాలు చేస్తుండటం వల్ల ఈ రూట్ నిత్యం రద్దీగా ఉంటుంది. ఈ మార్గంలో నానల్‌నగర్‌తో పాటు చాలా చోట్ల ఉదయం నుంచి అర్థరాత్రి వరకు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంటుంది. ఈ సమస్యకు చెక్ పెట్టడం కోసం రేతిబౌలి, నానల్‌ నగర్ జంక్షన్‌లలో హెచ్ సిటీ కింద తీసుకువచ్చేందుకు బల్దియా ప్లాన్ చేస్తోంది. దీనిలో భాగంగా సరోజినీ దేవీ ఐ హస్పిటల్ నుంచి.. ఆరాంఘర్ వరకు ఉన్న పీవీఆర్ ఎక్స్‌ప్రెస్‌వేకు సమాంతరంగా మల్టీలెవర్ ఫ్లైఓర్, గ్రేడ్ సెపరేటర్లను నిర్మించేందుకు జీహెచ్ఎంసీ ముందుకు వచ్చింది. ఇందుకుగాను రూ.398 కోట్ల రూపాయలు కేటాయించనుంది. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం వచ్చే నెల అనగా సెప్టెంబర్ 1-22 వరకు బిడ్లను స్వీకరించనున్నారు. అలానే సెప్టెంబర్ 8న ప్రీబిడ్ మీటింగ్ నిర్వహించనున్నారు. ఈమేరకు జీహెచ్ఎంసీ శుక్రవారం టెండర్లను ఆహ్వానించింది. ర్యాంపుల ఏర్పాటు..మెహిదీపట్నం జలమండలి ఫిల్డర్ బెడ్ నుంచి పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వేకు సమాంతరంగా ఈ ఫ్లైఓవర్‌ను నిర్మించనున్నారు. అలానే రేతిబౌలి జంక్షన్‌లో అత్తాపూర్ వైపు ఓ ర్యాంప్ ఏర్పాటు చేయబోతున్నారు. నానల్ నగర్ జంక్షన్‌కు దగ్గర ఉన్న ఆలివ్ హాస్పిటల్ వరకు ఓ ర్యాంప్ ఏర్పాటు చేయనున్నారు. వీటి నిర్మాణం కోసం ఇప్పటికే జీహెచ్ఎంసీ టెండర్లను కూడా ఆహ్వానించింది. రెండు లైన్లతో నిర్మించే ఫ్లైఓవర్ నిర్మాణం కోసం మెహిదీపట్నంలోని రక్షణ శాఖ స్థలాన్ని సేకరించేందుకు జీహెచ్ఎంసీ సంబంధిత అధికారులతో చర్చలు జరుపుతున్నారు.రోడ్ నెం12 నుంచి మరొకటి..బంజారాహిల్స్ నుంచి లంగర్ హౌజ్ వైపు వెళ్లే వెహికల్స్.. ఇప్పుడు రోడ్ నం.12లోని విరించి హాస్పిటల్ జంక్షన్ నుంచి మెహిదీపట్నం రైతుబజార్, రేతిబౌలి, నానల్ నగర్ మీదుగా వెళ్తుంటాయి. అలానే విమానాశ్రయం వైపు వెళ్లే వాహనాలు సరోజినీ దేవి ఐ హాస్పిటల్ మీదుగా పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే మీదుగా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటున్నాయి. దీని వల్ల ఈ రూట్లో నిత్యం ట్రాఫిక్ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమస్య పరిష్కారం కోసం బంజారాహిల్స్ రోడ్ నం.12 నుంచి హుమాయున్ నగర్ మెయిన్ రోడ్డు వరకు ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. వీటి నిర్మాణం కోసం జీహెచ్ఎంసీ ఇప్పటికే ప్రతిపాదనలు రెడీ చేసింది. ప్రస్తుతం ఇవి స్థల సేకరణ దశలో ఉన్నట్లు అధికారులు తెలిపారు