ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక. రాష్ట్రంలో కురవనున్నాయి. పశ్చిమ బెంగాల్-ఒడిశా తీరాలకు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఈ ఉపరితల ఆవర్తనం మంగళవారం నాటికి (సెప్టెంబర్ 02) ఉందని అంచనా వేసింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో 3 రోజులపాటు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. మరోవైపు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిలో వరద ప్రవాహం పెరిగి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆదివారం మధ్యాహ్నం సమయానికి భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం 47.9 అడుగులకు చేరింది. ధవళేశ్వరం వద్ద ఇన్,ఔట్ ఫ్లో 10.92లక్షల క్యూసెక్కులుగా ఉంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో లంక గ్రామాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. మరింత అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.విజయవాడ వరదలకు ఏడాదిమరోవైపు బుడమేరు ఉధృతితో విజయవాడ వరదలు సంభవించి ఏడాది పూర్తైంది. ఏడాది కిందట భారీ వర్షాలు, వరదలతో విజయవాడ నగరం అతలాకుతలమైంది. కుండపోత వర్షానికి బెజవాడ వాసులు వణికిపోయారు. 8 అడుగుల ఎత్తున వరద నీరు ప్రవహించింది. 50 ఏళ్లలో ఎన్నడూలేని విధంగా విజయవాడలో 334.2 మి.మీ .రికార్డు వర్షపాతం నమోదైంది. దీంతో వరదలతో బెజవాడ బెంబేలెత్తిపోయింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగ్‌నగర్‌లో పర్యటించి.. బాధితులకు భరోసా కల్పించారు. చీకట్లో అరగంటకుపైగా బోటులో తిరుగుతూ సహాయక చర్యలను పర్యవేక్షించారు.50 సహాయక బృందాలు, హెలికాఫ్టర్లు, డ్రోన్లు, బోట్లు, అగ్నిమాపక సిబ్బంది, ఇతర టెక్నాలజీ సాయంతో వరద బాధితులకు ఆహారం, మందులు పంపిణీ చేశారు. అలాంటి గాయానికి నేటికి (ఆగస్ట్ 31) ఏడాది పూర్తి కావటంతో.. విజయవాడవాసులు ఆ భయానక అనుభవాన్ని గుర్తుకు తెచ్చుకుంటున్నారు.