కొంప ముంచిన మ్యూచువల్ ఫండ్స్.. 233 స్కీమ్స్ అంతే.. టాప్-9 పథకాల లిస్ట్ ఇదే

Wait 5 sec.

SIP Investment: రిస్క్ ఉన్నా హైరిటర్న్స్ కోరుకునే వారు మ్యూచువల్ ఫండ్స్‌ ఎంచుకుంటారు. ఇందులో దీర్ఘకాలంలో మంచి రాబడులు వస్తాయని చాలా ఫండ్స్ నిరూపించాయి. కొన్ని స్వల్ప కాలంలోనే ఎక్కువ రాబడులు ఇస్తుంటాయి. కానీ గత ఏడాది కాలంలో చూసుకుంటే చాలా ఫండ్స్ నష్టాలు మిగిల్చాయి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ( ) పెట్టుబడులు పెట్టిన వారి కొంప ముంచేశాయి. ఏకంగా 233 ఈక్విటీ ఫండ్ పథకాలు నష్టాలు మిగిల్చాయి. ఈటీ నివేదిక ప్రకారం కొన్ని స్కీమ్స్ ఏకంగా 20 శాతం వరకు నష్టపోయాయి. గత ఏడాదిలో 273 ఫండ్స్ పని తీరును పరిశీలించగా అందులో 233 ఫండ్స్ నష్టపోవడం గమనార్హం. అందులో టాప్ 9 పథకాల గురించి తెలుసుకుందాం. గత ఏడాది కాలంలో చూస్తే ఈ ఫండ్ ఏకంగా 21.25 శాతం మేర పడిపోయింది. ఆ తర్వాత క్వాంట్ మల్టీ క్యాప్ ఫండ్ 17.31 శాతం మేర నష్టపోగా క్వాంట్ మిడ్ క్యాప్ ఫండ్ 17.22 శాతం మేర నష్టపోయింది. వీటి తర్వాత మోతీలాల్ ఓశ్వాల్ మ్యూచువల్ ఫండ్ నుంచి వచ్చిన మోతీలాల్ ఓస్వాల్ ఫోకస్డ్ ఫండ్ గత ఏడాదిలో 17.06 శాతం మేర పడిపోయింది. ఇక ఎన్‌జే ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఏడాదిలో ఏకంగా 16.16 శాతం మేర నష్టాలు మిగిల్చింది. క్వాంట్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ గత ఏడాది కాలంలో చూస్తే తమ ఇన్వెస్టర్లకు 15.68 శాతం మేర నష్టాలు మిగిల్చింది. శ్రీరామ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఏడాదిలో 15.31 శాతం మేర పడిపోయింది. ఇక రెండు క్వాంట్ మ్యూచువల్ ఫండ్ నుంచి భారీగా పడిపోయాయి. అందులో క్వాంట్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ గత ఏడాదిలో 15.21 శాతం మేర పడిపోయింది. అలాగే క్వాంట్ వాల్యూ ఫండ్ చూస్తే గత సంవత్సర కాలంలో 15.21 శాతం మేర నెగెటివ్ రిటర్న్స్ ఇచ్చింది. సాధారణంగా దీర్ఘకాలంలో సిప్ పెట్టుబడుల్లో హైరిటర్న్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్వల్ప కాల నష్టాలకు బెదరకుండా పెట్టుబడులు కొనసాగిస్తూ వెళ్తే 5,10,15 సంవత్సరాల్లో హైరిటర్న్స్ అందుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, తమ ఆర్థిక స్థోమత, భవిష్యత్తు ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ తీసుకునే సామర్థ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని పెట్టుబడికొనసాగించాలా లేదా అనే నిర్ణయం తీసుకోవాలి.