భారీ వర్షాలతో 2 లక్షల 20 వేల ఎకరాల్లో పంట నష్టం.. ఆ జిల్లాలో ఊహించని విధంగా..

Wait 5 sec.

తెలంగాణలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు పంటలపై తీవ్ర ప్రభావం చూపాయి. వర్షాలతో వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లి.. కృష్ణా–గోదావరి నదులు ఉద్ధృతంగా ప్రవహించాయి. అనేక రహదారులు దెబ్బతిని రాకపోకలు నిలిచిపోయాయి. పలు ప్రాంతాల్లో వరదలు ఇళ్లను ముంచెత్తగా.. పంట పొలాలు చిన్న చెరువుల్లా మారిపోయాయి. రైతులు కష్టపడి వేసిన పంటలు కళ్లముందే నీటమునిగిపోవడంతో తీవ్ర నిరాశలో మునిగిపోయారు. పెట్టుబడి సొమ్ము అంతా నీళ్లపాలు కావడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. రాష్ట్రవ్యాప్తంగా 270 మండలాలు, 2,463 గ్రామాలు ఈ వర్షాలకు ప్రభావితమయ్యాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం 2,20,443 ఎకరాల్లో పంటలు నష్టపోయాయని వ్యవసాయశాఖ తెలిపింది. ఈ క్రమంలో 1,43,304 మంది రైతులు నష్టపోయారని ప్రభుత్వం గుర్తించింది. ముఖ్యంగా కామారెడ్డి జిల్లా అత్యధికంగా దెబ్బతింది. అక్కడే 77,394 ఎకరాల పంట దెబ్బతింది. దాంతో 54,223 మంది రైతులు నష్టాన్ని ఎదుర్కొన్నారు. మెదక్ జిల్లాలో 23,169 ఎకరాల్లో పంటల నష్టం జరగ్గా.. 24,808 మంది రైతులు ప్రభావితమయ్యారు. అదిలాబాద్‌లో 21,276 ఎకరాలు నీట మునిగిపోవడంతో 8,071 మంది రైతులు ఇబ్బందులు పడ్డారు. నిజామాబాద్‌లో 18,417 ఎకరాలు దెబ్బతిన్నాయి, 9,155 మంది రైతులు నష్టపోయారు. అసిఫాబాద్‌లో 15,317 ఎకరాలు మునిగిపోయి 7,259 మంది అన్నదాతలు బోరున విలపించారు. నివేదికల ప్రకారం.. వరి అత్యధికంగా 1,09,626 ఎకరాల్లో నష్టపోయింది. పత్తి 60,080 ఎకరాల్లో దెబ్బతింది. సోయాబీన్, పప్పుధాన్యాలు, జొన్న, టమాటా, మిరప, అలాగే 20,983 ఎకరాల్లో ఉద్యాన పంటలు కూడా తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈ పరిస్థితుల్లో రైతులు ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. విత్తనాలు, ఎరువులు, పరిహారం వంటి అంశాల్లో తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. విపరీతమైన వర్షాలతో రైతుల కలలు కూలిపోవడంతో, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై అందరి చూపు నిలిచింది. అయితే గతంలో తెలంగాణ ప్రభుత్వం వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకుంది. ఎ. వాటికి సంబంధించి పంపిణీ చేశారు. ఈ సారి కూడా తెలుస్తోంది.