ఏపీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత నియోజకవర్గంలో తీవ్ర ఘర్షణలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే , వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అప్పటినుంచి దాదాపు 14 నెలలుగా ఆయన తాడిపత్రిలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. లా అండ్ ఆర్డర్ పేరుతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు సింగిల్ జడ్జి అనుమతివ్వగా.. డివిజన్ బెంచ్ దాన్ని సస్పెండ్ చేసింది. ఈ పిటిషన్ హైకోర్టులో ఉండగానే.. కేతిరెడ్డి సుప్రీంకోర్టుకెక్కారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన బిగ్ రిలీఫ్ ఇచ్చింది. తాడిపత్రి నియోజకవర్గంలోకి వెళ్లేందుకు కేతిరెడ్డికి రూట్ క్లియర్ చేసింది. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన పెద్దారెడ్డి.. త్వరలోనే తాడిపత్రిలో అడుగుపెడతానని స్పష్టం చేశారు.ఏపీలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత.. తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. జేసీ ప్రభాకర్‌రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఎన్నికల తర్వాత నుంచి దాదాపు 14 నెలలుగా.. ఆయన తాడిపత్రిలో అడుగుపెట్టలేదు. తన నియోజకవర్గానికి వెళ్లాలనుకున్న ప్రతీసారి శాంతిభద్రతల కారణంగా పోలీసులు కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడ్డుకున్నారు. ఒకానొక సందర్భంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పెద్దారెడ్డికి ఊరట లభించింది. అయినా సరే కేతిరెడ్డి వస్తే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని పోలీసులు ఆయనను అనుమతించలేదు. ఈ క్రమంలోనే పోలీసులపై హైకోర్టులో పెద్దారెడ్డి ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో పోలీసుల నుంచి హైకోర్టు వివరణ కోరగా.. పెద్దారెడ్డిని రానివ్వకపోవడనికి కారణం శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందనే అని అనంతపురం ఎస్పీ సమాధానం ఇచ్చారు. దీంతో గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన అనుమతిని.. హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేసింది. తాడిపత్రి వెళ్లేందుకు పెద్దారెడ్డికి వచ్చిన అనుమతిని రద్దు చేస్తూ హైకోర్టు విచారణను వాయిదా వేసింది. ఇక ఈ పిటిషన్‌ హైకోర్టులో విచారణలో ఉండగానే.. కేతిరెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు రూట్ క్లియర్ చేసుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పుపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తాడిపత్రి వెళ్లేందుకు తనకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిందని.. పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు కాపీలను త్వరలోనే ఎస్పీకి అందజేసి.. తాడిపత్రి వెళ్తానని వెల్లడించారు. తాడిపత్రి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ.. సేవ చేస్తానని అన్నారు.పెద్దారెడ్డి పిటిషన్‌ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సొంత నియోజకవర్గంలోకి వెళ్లకుండా మిమ్మల్ని ఎవరు ఆపుతారు అంటూ పెద్దారెడ్డిని ప్రశ్నించింది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలపై స్టే విధిస్తూ.. తాడిపత్రి వెళ్లడానికి పెద్దారెడ్డికి అవసరమైన భద్రతను కల్పించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఒకవేళ అవసరమైతే ప్రైవేట్‌ సెక్యూరిటీ కూడా పెట్టుకోవచ్చని పెద్దారెడ్డికి సూచించింది. పోలీస్ సెక్యూరిటీకి అవసరమైన ఖర్చును భరించేందుకు పెద్దారెడ్డి సిద్ధంగా ఉన్నట్టు ఆయన తరపు లాయర్లు కోర్టుకు తెలిపారు.