ప్రపంచవ్యాప్తంగా ఉన్నత చదువులు చదువుకోవాలనే చాలా మంది.. అమెరికా వైపు చూస్తూ ఉంటారు. ప్రతీ సంవత్సరం లక్షలాది మంది విద్యార్థులు చదువుకునేందుకు అమెరికా వెళ్తూ ఉంటారు. అమెరికాలోని టాప్ యూనివర్సిటీల్లో సీటు దక్కించుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తారు. ఫీజులు అధికంగా ఉన్నప్పటికీ.. మంచి యూనివర్సిటీల్లో సీటు తెచ్చుకుంటే.. ఇక విద్యారంగంలో ప్రపంచదేశాల కంటే ముందు వరుసలో ఉన్న అమెరికాలో ఆధిపత్యం కోసం ఏటా అనేక యూనివర్సిటీలు పోటీ పడుతూ ఉంటారు. అయితే అమెరికాలోనే బెస్ట్ కాలేజెస్ 2026 ఎడిషన్‌ లిస్ట్‌ను యూఎస్ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ విడుదల చేసింది. దేశంలో అత్యంత విశిష్టమైన విద్యాసంస్థగా తన వారసత్వాన్ని నిలబెట్టుకుంది. యూనివర్సిటీల్లోని బోధనపై విశ్వసనీయత, ప్రొఫెసర్లు, రీసెర్చ్ ఫలితాలు, విద్యార్థుల భవిష్యత్తును ప్రతిబింబించేలా ఈ ర్యాంకింగ్‌లను ప్రకటిస్తారు. ఈ సంవత్సరం ర్యాంకింగ్‌లలో అత్యుత్తమంగా నిలిచిన టాప్ 10 యూనివర్సిటీలను (2, యూనివర్సిటీలు 4వ ర్యాంకు, 4 యూనివర్సిటీలు 7వ ర్యాంకును పంచుకున్నాయి) వెల్లడించారు.ర్యాంక్యూనివర్సిటీ పేరుస్థాపించబడిన సంవత్సరంఅండర్‌గ్రాడ్యుయేట్ ఎన్‌రోల్‌మెంట్ట్యూషన్ ఫీజు (సంవత్సరానికి) 1ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ 17465,81365,210 డాలర్లు2మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ18614,53564,730 డాలర్లు3హార్వర్డ్ యూనివర్సిటీ16367,03864,796 డాలర్లు4స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ18857,90468,544 డాలర్లు4యేల్ యూనివర్సిటీ17016,81469,900 డాలర్లు6యూనివర్సిటీ ఆఫ్ చికాగో1890751973,266 డాలర్లు7డ్యూక్ యూనివర్సిటీ 18386,52373,172 డాలర్లు7జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ 1876635667,170 డాలర్లు7నార్త్‌వెస్ట్రన్ యూనివర్సిటీ18519,060 70,589 డాలర్లు 7యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా 174010,01371,236 డాలర్లు