ఒక్కరోజులో సీన్ రివర్స్.. బంగారం ధరల్లో ఊహించని మార్పు.. అక్కడ అలా, ఇక్కడ ఇలా.. నేటి గోల్డ్ రేట్లు ఇవే

Wait 5 sec.

: బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు ఎప్పటికప్పుడు ధరలు తెలుసుకుంటూ ఉండాలి. ఎందుకుంటే బులియన్ మార్కెట్లో ధరలు రోజు రోజు మారుతుంటాయి. ఇటీవలి కాలంలో పసిడి ధరలు ఊహించని విధంగా మారిపోతున్నాయి. ఈ 2025లో బంగారం రేట్లు 50 శాతానికి పైగా పెరిగాయి. సరికొత్త గరిష్ఠాలను తాకి మళ్లీ కాస్త వెనక్కి వచ్చాయి. దీంతో కొనుగోలుదారులు ఊపిరిపీల్చుకున్నారు. అంతర్జాతీయ రాజకీయ భౌగోళిక, వాణిజ్య అంశాలు, అమెరికా సుంకాలు, ఫెడ్ నిర్ణయాలు, దేశీయంగా గిరాకీ వంటివి బంగారం ధరలపై ప్రభావం చూపిస్తుంటాయి. రెండు రోజుల క్రితం దేశీయ మార్కెట్లో బంగారం రేటు తగ్గడంతో కొనుగోలుదారులకు ఊరట లభించింది. ఆ తర్వాత రోజు సైతం ఎలాంటి మార్పు లేకుండా అదే ధర వద్ద కొనసాగింది. ఇక ధర తగ్గుతుంది లే అనుకునే సమయానికి ఇవాళ ఒక్కసారిగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. ఇవాళ స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 16 డాలర్లకు పైగా పడిపోయింది. దీంతో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 3986 వద్దకు దిగివచ్చింది. ఇక స్పాట్ సిల్వర్ ధర ఇవాళ 1.48 శాతం మేర తగ్గి 47.97 డాలర్ల వద్దకు దిగివచ్చింది. ఈ ప్రభావం దేశీయంగానూ ఉంటుందని బులియన్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంటే రేపటి రోజున దేశీయంగా ధరలు తగ్గేందుకు ఛాన్స్ ఉంటుంది. హైదరాబాద్‌లో బంగారం ధరలుఆదివారం రోజున భారీగా తగ్గిన బంగారం రేటు సోమవారం స్థిరంగా కొనసాగింది. అయితే ఆ తర్వాత ఇవాళ ఒక్కసారిగా పెరిగింది. ఇవాళ 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు 10 గ్రాములపై రూ. 170 మేర పెరిగింది. దీంతో తులం రేటు రూ.1,23,170 వద్దకు చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం రేటు రూ.150 పెరగడంతో రూ. 1,12,900 వద్దకు చేరుకుంది. రూ.2000 పెరిగిన వెండి ధరహైదరాబాద్ మార్కెట్లో వెండి రేటు ఒక్కరోజే ఏకంగా రూ.2000 పెరిగింది. గత వారం రోజులుగా తగ్గుతూ వచ్చి ఊరట కల్పించిన వెండి ఇవాళ ఒక్కసారిగా పెరగడం గమనార్హం. దీంతో హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 1,68,000 మార్క్ వద్దకు చేరుకుంది. అయితే, బెంగళూరు, పుణే, ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో కిలో వెండి రేటు రూ.1,54,000 వద్ద ట్రేడవుతుండడం గమనార్హం. పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు నవంబర్ 4వ తేదీ మంగళవారం రోజు ఉదయం 7 గంటల సమయానికి ఉన్నవి. అయితే, బంగారం రేట్లు మధ్యాహ్నానికి మారుతుంటాయి. కొనే ముందే తెలుసుకోవడం మంచిది.