Gold Rate Today: భారతీయులకు బంగారం అంటే ఎంతో ఇష్టం. వందల సంవత్సరాల నుంచి భారతీయ సంస్కృతి, సాంప్రదాయాల్లో బంగారానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. పసిడి ఆభరణాలు ధరించేందుకు ఇష్టపడుతుంటారు. రాజుల కాలం నుంచి నేటి వరకు బంగారం నగలు ధరించే ఆచారం కొనసాగుతూనే ఉంది. దీంతో మన దేశంలోకి బంగారం టన్నుల కొద్ది దిగుమతి అవుతుంటుంది. ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే అత్యధికంగా బంగారం దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో మనం రెండో స్థానంలో ఉన్నామంటేనే ఏ స్థాయిలో బంగారం వినియోగిస్తున్నామో అర్థమవుతుంది. అయితే, ఈ 2025 సంవత్సరంలో బంగారం ధర ఊహించని విధంగా పెరిగిన సంగతి తెలిసిందే. దీపావళి ముందు వరకు వరుసగా పెరిగింది. ఆ తర్వాత ఇప్పుడు తగ్గుతూ వస్తోంది. దీంతో కాస్త ఊరట లభించినట్లయింది. మరి అక్కడ తగ్గిన బంగారం ధరఅంతర్జాతీయ మార్కెట్లో మళ్లీ తగ్గాయి. ఈరోజు స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 13 డాలర్లకు పైగా తగ్గింది. దీంతో ఔన్స్ గోల్డ్ రేటు 3984 డాలర్ల స్థాయికి దిగివచ్చింది. ఇక స్పాట్ సిల్వర్ రేటు సైతం తగ్గింది. ఇప్పుడు ఔన్స్ సిల్వర్ రేటు 48.55 డాలర్ల స్థాయికి దిగివచ్చింది. హైదరాబాద్‌లో బంగారం రేటుహైదరాబాద్ బులియన్ మార్కెట్లో గోల్డ్ రేటు ఇవాళ స్థిరంగా ఉంది. అయితే, క్రితం రోజు తగ్గిన సంగతి తెలిసిందే. దీంతో కొనుగోలుదారులకు ఇదే మంచి అవకాశంగా చెప్పవచ్చు. ఈరోజు 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు తులానికి రూ.1,23,000 మార్క్ వద్ద ట్రేడవుతోంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం రేటు ఏ మార్పు లేకుండా 10 గ్రాములకు రూ.1,12,750 వద్ద ఉంది. స్థిరంగానే వెండి రేటుఇవాళ బంగారం రేటుతో పాటు వెండి రేటూ మారలేదు. ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.1,66,000 మార్క్ వద్ద ట్రేడవుతోంది. అయితే, బెంగళూరు, ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో కిలో వెండి రేటు రూ. 1,52,000 స్థాయిలోనే లభిస్తుండడం గమనార్హం. పైన చెప్పిన బంగారం, వెండి రేట్లు నవంబర్ 3వ తేదీ సోమవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఉన్నవి. అయితే, మధ్యాహ్నానికి రేట్లు మారవచ్చు. కొనుగోలు చేసే ముందు స్థానిక జువెలర్స్ వద్ద రేట్లు తెలుసుకోవడం మంచిది.