వరల్డ్ కప్ విన్నర్‌ డీఎస్పీ దీప్తి శర్మకి యూపీ పోలీస్ సెల్యూట్.. స్పెషల్ విషెస్ చెప్పిన డీజీపీ

Wait 5 sec.

కు ఉత్తరప్రదేశ్ పోలీస్ శాఖ అభినందనలు తెలిపింది. నవి ముంబైలో జరిగిన 2025 ఐసీసీ మహిళా వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫైనల్‌లో ఐదు వికెట్లు తీయడంతో పాటు బ్యాట్‌తోనూ అదరగొట్టి ట్రోఫీ రావడానికి ప్రధాన కారణంగా నిలిచింది. ఉత్తరప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) రాజీవ్ కృష్ణ దీప్తిని అభినందిస్తూ “దీప్తి శర్మ అంతర్జాతీయ వేదికపై రాష్ట్రం, దేశానికి గర్వకారణం అయ్యారు. 215 పరుగులు, 22 వికెట్లు సాధించి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా ఎంపిక కావడం అద్భుతమైన ఘనత” అని పేర్కొన్నారు. “అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్‌లో దీప్తి శర్మ అద్భుత ప్రదర్శన కనబర్చారు. ఆమె 215 పరుగులు, 22 వికెట్లు తీసి ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ బహుమతిని గెలుచుకున్నారు. దేశం, రాష్ట్రం, మరియు ఉత్తరప్రదేశ్ పోలీస్‌కు గౌరవం తెచ్చారు. హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు దీప్తి శర్మకు” అంటూ యూపీ పోలీస్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీప్తి శర్మ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించిన ‘కుశల్ ఖిలాడీ యోజన’ కింద క్రీడా కోటా ద్వారా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా 2025 జనవరిలో నియమితులయ్యారు. టోర్నమెంట్ మొత్తంలో దీప్తి 22 వికెట్లు తీసి, 215 పరుగులు సాధించారు. ఈ అద్భుత ప్రదర్శనతో ఆమెకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది. నవి ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో 28 ఏళ్ల దీప్తి చరిత్ర సృష్టించింది. వరల్డ్‌కప్ నాకౌట్ మ్యాచ్‌లో అర్ధశతకం, ఐదు వికెట్లు తీసిన తొలి ప్లేయర్‌గా నిలిచింది. ఆమె 54 పరుగులు చేసి, 5 వికెట్లు (5/39) తీసి భారత్‌ను వన్డే వరల్డ్‌కప్‌ను కైవసం చేసుకునేలా చేసింది. “నేను చాలా సంతోషంగా ఉన్నాను. మొదటి మ్యాచ్ నుంచే నేను అనుకున్న విధంగా ఆడగలిగాను. ఫైనల్‌లో అద్భుత ప్రదర్శన ఇవ్వడం, ట్రోఫీ గెలుచుకోవడం కన్నా గొప్ప విషయం ఏదీ ఉండదు. ఈ వరల్డ్‌కప్ గెలవడానికి మనం చాలా కాలం ఎదురుచూశాం. కానీ దేవుడు నిర్ణయించిన సమయానికే జరిగే పనులు అవుతాయి. ఈ విజయం భారత నేలపై జరగడం దానికి మరింత విలువ తెచ్చింది” అని దీప్తి శర్మ మ్యాచ్ అనంతరం చెప్పింది.