ఏపీలో కొత్తగా ఆర్టీసీ అతిపెద్ద బస్టాండ్.. రూ.500 కోట్లతో ఈ ప్రాంతంలోనే.. కీలక ప్రకటన

Wait 5 sec.

తిరుపతిలో దేశంలోనే ఎక్కడా లేని విధంగా అత్యాధునిక హంగులతో రూ.500 కోట్లతో ఇంట్రా మోడల్‌ బస్సు టర్మినల్‌ (బస్టాండ్)ను నిర్మించబోతున్నామన్నారు రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. ఈ టర్మినల్ ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. ఆయన తిరుపతి అలిపిరి రోడ్డులో నూతనంగా నిర్మించిన ఆర్టీసీ ఆస్పత్రిని ప్రారంభించారు. ఆర్టీసీ ఆస్పత్రిని రూ.1.90 కోట్లతో అధునాతన సౌకర్యాలతో నిర్మించబడిందని, ఇది ఆర్టీసీ ఉద్యోగులకు, వారి కుటుంబాలకు మెరుగైన వైద్య సేవలను అందిస్తుందని చెప్పారు. అలాగే, శ్రీవారి దర్శనార్థం తిరుపతికి వచ్చే ఆర్టీసీ ప్రముఖులు, అధికారులు, అతిథుల కోసం రూ.2 కోట్లతో విశ్రాంతి గదులను నిర్మించామని తెలిపారు.లో నడిపించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఆర్టీసీలో ప్రమాదాల నివారణకు చట్టాలను కఠినతరం చేస్తున్నామని, కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఫిట్‌నెస్ లేని బస్సుల విషయంలో రాజీపడేది లేదని.. ఆ బస్సుల్ని సీజ్ చేస్తున్నామన్నారు. ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. వందశాతం ప్రమాణాలున్న బస్సులు మాత్రమే రోడ్డెక్కాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే రోడ్లను గుర్తించి, అక్కడ తీసుకోవాల్సిన చర్యలపై ఆలోచిస్తున్నారు. రోడ్లు, హైవేలపై తరచుగా ప్రమాదాలు జరిగే ప్రదేశాలను "బ్లాక్‌స్పాట్స్‌"గా గుర్తిస్తామన్నారు. ఈ ప్రదేశాలలో ప్రమాదాలను నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో అధికారులతో చర్చిస్తున్నామన్నారు. ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సుల విషయంలో సీరియస్‌గా ఉన్నామని.. ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే డ్రైవర్లకు నైపుణ్యం, మెళుకువలు అవసరమన్నారు. అలాగే మద్యం కుంభకోణంలో మాజీ మంత్రి జోగి రమేశ్‌ అరెస్టు కక్షపూరితం కాదన్నారు. ఈ కేసులో చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందన్నారు రాంప్రసాద్ రెడ్డి. తిరుపతిలో జరిగిన ఆర్టీసీ కార్యక్రమాల్లో మంత్రి రాంప్రసాద్‌రెడ్డితో పాటుగా ఆర్టీసీ ఛైర్మన్‌ కొనకళ్ల నారాయణరావు, ఎండీ ద్వారాకా తిరుమలరావు, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, తుడా ఛైర్మన్‌ దివాకర్‌రెడ్డి, ఆర్టీసీ జోనల్‌ ఛైర్మన్లు పాల్గొన్నారు.