బోణీ కొట్టిన భారత్.. మహిళల వన్డే ప్రపంచకప్ విజేతల లిస్ట్ ఇదే..!

Wait 5 sec.

మహిళల వన్డే నిలిచింది. ఈ టోర్నీకి ముందు వరకు 12 ఎడిషన్లు జరిగాయి. అందులో రెండుసార్లు భారత్ ఫైనల్ వరకూ చేరింది. కానీ చివరి మెట్టుపై బోల్తా పడి టైటిల్ కలను నెరవేర్చుకోలేకపోయింది. కానీ ఈసారి మాత్రం పట్టువదల్లేదు. సొంతగడ్డపై జరిగిన అదరగొట్టింది. ఓ దశలో హ్యాట్రిక్ ఓటములు ఎదురైనా.. బలంగా పుంజుకుంది. హ్యాట్రిక్ ఓటముల తర్వాత వరుసగా నాలుగు విజయాలు సాధించి.. తొలి టైటిల్ ఖాతాలో వేసుకుంది.1973లో తొలిసారి వన్డే ప్రపంచకప్ నిర్వహించారు. అందులో ఇంగ్లాండ్ విజేతగా నిలిచింది. వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఎక్కువసార్లు ఆస్ట్రేలియా జట్టే విజేతగా నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో ఇంగ్లాండ్ ఉంది. ఇంగ్లాండ్ నాలుగు సార్లు టైటిల్ ఎగరేసుకుపోయింది. ఒకసారి న్యూజిలాండ్ గెలుపొందింది. దీన్ని బట్టి చూస్తే.. మహిళల వన్డే ప్రపంచకప్ అంటే.. అయితే ఆస్ట్రేలియా లేదా ఇంగ్లాండ్. ఈ రెండు జట్ల మధ్యే పోటీ ఉండేది. కానీ ఈసారి మాత్రం సీన్ రివర్స్ అయింది. టీమిండియా కొత్త ఛాంపియన్‌గా అవతరించింది. దీంతో మహిళల వన్డే ప్రపంచకప్ టైటిల్స్ సాధించిన జట్ల జాబితాలో చేరిపోయింది.మహిళల వన్డే ప్రపంచకప్ టైటిల్ సాధించిన నాలుగో జట్టుగా భారత్ అవతరించింది. ఆదివారం ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి ఈ ఫీట్ సాధించింది. ఈ నేపథ్యంలో టోర్నీ ప్రారంభమైన 1973 నుంచి 2025 వరకు మహిళల వన్డే ప్రపంచకప్ విజేతలు ఎవరో ఇప్పుడు చూద్దాం..1973 - ఇంగ్లాండ్ (రన్నరప్: ఆస్ట్రేలియా)1978 - ఆస్ట్రేలియా (రన్నరప్: ఇంగ్లాండ్)1982 - ఆస్ట్రేలియా (రన్నరప్: ఇంగ్లాండ్)1988 - ఆస్ట్రేలియా (రన్నరప్: ఇంగ్లాండ్)1993 - ఇంగ్లాండ్ (రన్నరప్: న్యూజిలాండ్)1997 - ఆస్ట్రేలియా (రన్నరప్: న్యూజిలాండ్)2000 - న్యూజిలాండ్ (రన్నరప్: ఆస్ట్రేలియా)2005 - ఆస్ట్రేలియా (రన్నరప్: భారత్)2009 - ఇంగ్లాండ్ (రన్నరప్: న్యూజిలాండ్)2013 - ఆస్ట్రేలియా (రన్నరప్: వెస్టిండీస్)2017 - ఇంగ్లాండ్ (రన్నరప్: భారత్)2022 - ఆస్ట్రేలియా (రన్నరప్: ఇంగ్లాండ్)2025 - భారత్ (రన్నరప్: దక్షిణాఫ్రికా)