తెలంగాణ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. నేటి నుంచి కాలేజీలు బంద్

Wait 5 sec.

ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నేటి నుంచి బంద్‌కు పిలుపునిచ్చాయి. బకాయిలు చెల్లించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంపై నిరసనగా.. డిగ్రీ, ఇంజనీరింగ్, ఫార్మసీ సహా అన్ని ప్రైవేటు వృత్తి విద్య కళాశాలలు సమ్మెలోకి దిగుతున్నాయి. ప్రైవేటు కాలేజీల యాజమాన్యాల సంఘాల సమాఖ్య ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,840 కానున్నాయి. దీని ఫలితంగా దాదాపు 35 లక్షల మందికి పైగా విద్యార్థుల చదువుపై తీవ్ర ప్రభావం పడనుంది.గత నాలుగేళ్లుగా పేరుకుపోయిన భారీ మొత్తంలో ఉన్న వెంటనే విడుదల చేయాలని ప్రైవేటు కాలేజీల సమాఖ్య గత రెండు నెలలుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. ఈ అంశంపై పలు దఫాలుగా చర్చలు కూడా జరిగాయి. గతంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దీపావళిలోగా రూ.1,200 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. అయితే.. ఆ హామీ మేరకు కేవలం రూ.300 కోట్లు మాత్రమే విడుదల చేయడంతో మిగిలిన రూ.900 కోట్లు విడుదల చేయాలని యాజమాన్యాలు పదేపదే విజ్ఞప్తి చేసినా సానుకూల స్పందన రాలేదు.ఈ నేపథ్యంలో ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు సమ్మె నోటీసు ఇవ్వగా.. ఆదివారం ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ఫాతీ ప్రతినిధులతో మాట్లాడారు. తక్షణమే రూ.150 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇస్తూ.. సమ్మెను విరమించాలని కోరారు. అయితే ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు బకాయిలు చెల్లించనంతవరకు సమ్మె విరమించేది లేదని యాజమాన్యాలు స్పష్టం చేశాయి. సమాఖ్య అధ్యక్షుడు నిమ్మగడ్డ రమేష్‌బాబు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మె చేస్తున్నామని తెలిపారు. సోమవారం నుంచి అన్ని ఉన్నత విద్యాసంస్థలు మూతపడతాయని, ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నప్పటికీ బకాయిలు విడుదలయ్యే వరకు సమ్మె కొనసాగుతుందని ఆయన తేల్చి చెప్పారు.యాజమాన్యాల సమ్మె నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు పరీక్షలను వాయిదా వేయాలని సమాఖ్య అన్ని యూనివర్సిటీలను కోరింది. దీనికి స్పందించిన అధికారులు పలు పరీక్షలను వాయిదా వేశారు. ముఖ్యంగా జేఎన్‌టీయూ (JNTU) పరిధిలోని ప్రథమ సంవత్సరం రెండో సెమిస్టర్ వార్షిక పరీక్షలు వాయిదా పడ్డాయి. అలాగే, బీఈడీ, డీఈడీ పరీక్షలు, పలు కాలేజీల్లో జరుగుతున్న ఇంజనీరింగ్ ఇంటర్నల్ పరీక్షలు కూడా వాయిదా వేస్తున్నట్లు యూనివర్సిటీలు ప్రకటించాయి.రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 800 ప్రైవేటు డిగ్రీ కాలేజీలు, 175 ఇంజనీరింగ్, 123 ఫార్మసీ, 300 ఎంబీఏ-ఎంసీఏ సహా మొత్తం 1,840 సంస్థలు ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి బకాయిలు విడుదల చేస్తేనే ఈ విద్యాసంస్థల సమ్మె విరమించే అవకాశం ఉంది.