రంగారెడ్డి జిల్లా చేవెళ్ల బస్సు ప్రమాద ఘటన నుంచి తేరుకోకముందే.. తెలుగు రాష్ట్రాల్లో మరో చోటుచేసుకుంది. ఏలూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఏలూరు జిల్లా లింగపాలెం వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తాపడింది. ఏలూరు నుంచి హైదరాబాద్ వస్తున్న భారతి ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. జూబ్లీనగర్ సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఒకరు చనిపోయినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.మరోవైపు సోమవారం తెల్లవారుజామున తెలంగాణలోని పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. లో 24 మంది మరణించారు. మరికొంతమంది తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతోఈ ప్రమాదం జరిగింది. ప్రమాద తీవ్రతకు ఆర్టీసీ బస్సు సగ భాగం నుజ్జునుజ్జు అయ్యింది. బస్సును ఢీకొట్టిన తర్వాత టిప్పర్.. బస్సుపై బోల్తా పడడంతో పాటుగా అందులో కంకర మీద పడటంతో చాలా మంది ప్రయాణికులు అందులో చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. పది నెలల చిన్నారితో పాటుగా 24 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాలను దిగ్ర్భాంతికి గురి చేసింది.మరోవైపు ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. కావేరీ ట్రావెల్స్ బస్సు... రోడ్డుపై పడి ఉన్న బైక్‌ను ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదం అనంతరం బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగి 19 మంది సజీవ దహనమయ్యారు.ఈ ఘటన నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న సమయంలో.. చేవెళ్ల బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ఇది జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే మరో బస్సు ప్రమాదానికి గురైందన్న వార్త కలవరపెడుతోంది. ఏలూరు జిల్లాలో భారతి ట్రావెల్స్ బస్సు బోల్తా పడిన ఘటనతో మరోసారి అందరిలోనూ భయాందోళన వ్యక్తమవుతోంది.