ప్రపంచ క్రికెట్‌లో గత కొన్నేళ్లుగా ఆటతీరు ఎంతో మారింది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఐసీసీ ఈవెంట్స్‌లలో వారి ప్రదర్శన అలా ఉంది. పరుషులు, మహిళల క్రికెట్‌లో కలిపి గత రెండేళ్లలో ఆ జట్టు ఐదుసార్లు ఐసీసీ ఫైనల్స్‌కు చేరుకుంది. అయితే ఇందులో నాలుగు సార్లు ఓడిపోయింది. దీంతో చివరిమెట్టుపై బోల్తా పడే అలవాటు మాత్రం ఆ జట్టు ఇంకా పూర్తిస్థాయిలో విడిచిపెట్టలేకపోతోంది. ‘ప్రతిభ ఎంతున్నా ఆవగింజంత అదృష్టం కూడా తోడవ్వాలి’ అనే నానుడి దక్షిణాఫ్రికా క్రికెట్ జట్లకు సరిగ్గా సరిపోతోంది.దిగ్గజ ప్లేయర్లుగా పేరు పొందిన షాన్ పొలాక్, మార్క్ బౌచర్, గ్రేమ్‌ స్మిత్‌, జాక్వెస్ కలిస్, ఏబీ డివిలియర్స్ లాంటి ఆటగాళ్లు సైతం ఆ జట్టుకు ప్రపంచకప్ కలను సాకారం చేయలేకపోయారు. గత రెండేళ్లలో సఫారీ పురుషుల, మహిళల జట్టు ఏకంగా ఐదు ఐసీసీ ఫైనల్స్‌ ఆడాయి. కానీ, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ మినహా.. మిగతా నాలుగు సార్లు పరాజయం పాలయ్యాయి. ఇందులో రెండుసార్లు భారత్ చేతిలోనే ఓడిపోవడం గమనార్హం.మహిళల టీ20 ప్రపంచకప్ 2023..సంచలన ప్రదర్శనతో పైనల్ చేరిన దక్షిణాఫ్రికా జట్టు తుది మెట్టుపై బోల్తా పడింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 157 పరుగుల ఛేదనలో 137కే పరిమితమై కప్పులకు దూరమైంది.పురుషుల టీ20 ప్రపంచకప్ 2024గతేడాది జరిగిన పురుషుల టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్‌లో దక్షిణాఫ్రికా గెలిచేలా కనిపించింది. కానీ డెత్ ఓవర్లలో ఒత్తిడికి చిత్తయి.. భారత్ చేతిలో పరాజయం పాలైంది. మహిళల టీ20 ప్రపంచకప్ 2024..గతేడాది జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌లోనూ దక్షిణాఫ్రికా పరాజయం పాలైంది. ఫైనల్‌ ఓడిపోయి.. మరోసారి రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది.వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌ 2025..ఈ ఏడాది జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో మాత్రం ప్రొటీస్ జట్టు గెలుపొందింది. ఫైనల్‌లో ఆస్ట్రేలియాను ఓడించి గదను సొంతం చేసుకుంది.మహిళల వన్డే ప్రపంచకప్ 2025..తాజాగా మహిళల వన్డే ప్రపంచకప్‌లోనూ దక్షిణాఫ్రికా రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్‌లో భారత్‌ చేతిలో పరాజయం పాలైంది.ఇవి కాకుండా పురుషులు వన్డే ప్రపంచకప్ 2023, పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో దక్షిణాఫ్రికా సెమీస్ నుంచి నిష్క్రమించింది.