మహిళల వన్డే ప్రపంచకప్ 2025 ఫైనల్‌లో భారత్.. నిలిపింది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచులో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్.. 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. ఓ దశలో 320 పరుగులపై కన్నేసిన టీమిండియా.. చివర్లో అనూహ్యంగా తడబడింది. దీంతో అనుకున్నదానికంటే తక్కువ స్కోరుకే పరిమితం అయింది. అయితే 300 కంటే తక్కువ స్కోరే చేసినప్పటికీ మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్స్‌లో రెండో అత్యధిక స్కోరును భారత్ నమోదు చేసింది.మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్స్‌లో అత్యధిక స్కోరు ఆస్ట్రేలియా పేరిట ఉంది. 2022లో జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్స్‌లో ఇంగ్లాండ్‌పై ఆస్ట్రేలియా 356/5 పరుగులు స్కోరు చేసింది. అంతకుమందు ఏ జట్టూ కూడా ఫైనల్‌లో 300 పరుగుల మార్కుకు చేరుకోలేదు.అయితే మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్స్‌లో అత్యధిక సక్సెస్ ఫుల్ రన్ ఛేజ్ మాత్రం 167 కావడం గమనార్హం. 2009 మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్స్‌లో ఇది నమోదు అయింది. 2009 మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్స్‌లో న్యూజిలాండ్ నిర్దేశించిన 167 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ఛేజ్ చేసింది.మహిళల వన్డే ప్రపంచక్ ఫైనల్స్‌లో అత్యధిక సక్సెస్ ఫుల్ రన్ ఛేజ్స్ ఇవే..*167 - 2009లో న్యూజిలాండ్‌పై ఇంగ్లాండ్ ఛేజ్ చేసింది.*165 - 1997లో న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా ఈ లక్ష్యాన్ని ఛేదించింది.*152 - 1982లో ఇంగ్లాండ్‌పై ఆస్ట్రేలియా ఛేజ్ చేసింది.*129 - 1988లో ఇంగ్లాండ్ జట్టు ఆస్ట్రేలియాపై ఈ లక్ష్యాన్ని ఛేదించింది.మొత్తంగా చూసుకంటే మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్స్ చరిత్రలో ఛేజింగ్‌ జట్టుకు మెరుగైన రికార్డు లేదు. ఈ లెక్కన ఫస్టు బ్యాటింగ్ చేసిన జట్టునే ఎక్కువ సార్లు విజయం వరించింది. మరి మహిళల వన్డే ప్రపంచకప్ 2025 ఫైనల్ పాత రికార్డులనే కంటిన్యూ చేస్తుందా? కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందా..? అనేది తేలాలి.